TG: నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్ ...ఒక్కొక్కరికి మూడు లక్షలు !


Published Mar 16, 2025 11:16:00 AM
postImages/2025-03-16/1742104049_TGRajivYuvaVikasamscheme1024x576.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది.రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీమ్ తీసుకొచ్చింది. దీని వల్ల ఒక్కో నిరుద్యోగికి 3లక్షల వరకు ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది.


తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక స్వయం ఉపాధి పథకం ‘‘రాజీవ్ యువ వికాసం’ను అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ పథకం కింద 6వేల కోట్ల బడ్జెట్ ఉంటుందని రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.


రాజీవ్ యువ వికాస పథకం కింద అర్హత కలిగిన అభ్యర్థులు తమ స్వయం ఉపాధి ప్రయత్నాలకు మద్దతుగా రూ.3లక్షల వరకు ఆర్థిక సహాయం పొందచ్చు. బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పథకానికి రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరణ జరుగుతుంది. ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఓబీఎంఎంఎస్ (తెలంగాణ ఆన్ లైన్ బెనిఫిషియరీ మేనేజ్ మెంట్ మానిటరింగ్) http//tgobmmsnew.cgg.gov.in ద్వారా ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని మల్లయ్య భట్టు తెలిపారు. అయితే, ఈ స్కీం అర్హతలు, ఇతర వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. 


*దరఖాస్తు ప్రారంభం తేదీ : మార్చి 15


*  దరఖాస్తు గడువు : ఏప్రిల్ 5


*  ఎంపిక, ధృవీకరణ : ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు


*  తుది లబ్ధిదారుల జాబితా ప్రకటన : జూన్ 2(తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం)


*  జిల్లా కలెక్టర్లు సమీక్షించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఎంపిక పత్రాలను పంపిణీ చేస్తారు.
 

newsline-whatsapp-channel
Tags : business unemployed education telangana

Related Articles