కనీసం తన కుర్చీకి మర్యాద ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థించారు.
న్యూస్ లైన్ డెస్క్: కనీసం తన కుర్చీకి మర్యాద ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. ఆదివారం జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది జర్నలిస్ట్‌లు రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్ట్‌లు హద్దులు దాటి వ్యవహారించకూడదని అన్నారు. కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నారని విమర్శలు చేశారు. జర్నలిస్టులు చీఫ్ మినిస్టర్‌ను చిప్ మినిస్టర్ అంటూ కుర్చీకు ఉన్న గౌరవం పొగొడుతున్నారని అన్నారు.
తను ప్రజలకు నచ్చకపోతే సరే ఓకే.. కానీ తను ముఖ్యమంత్రి కాబట్టి కనీసం ఆ కుర్చీకి అయినా మర్యాద ఇవ్వాలని ఆయన కోరారు. జర్నలిస్ట్‌ల అక్రిడిడేషన్ విషయంలో కఠన నిబంధనలు ఉంటాయి అని ఆయన అన్నారు. కొన్నిసార్లు చిట్ చాట్‌లను సైతం తప్పుడుగా రాస్తున్నారని తెలిపారు. గతంలో గాంధీ భవన్‌లో సన్నిహితంగా మాట్లాడిన మాట్లలను రికార్డు చేసిన సందర్భలు ఉందని, అందుకోసమే జర్నలిస్ట్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందన్నారు. జర్నలిస్టులు ఆరోగ్య శ్రీ కార్డుల విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. బషీర్‌బాద్‌లో 38 ఎకరాల భూమిపత్రాలను జర్నలిస్టులకు ప్రభుత్వం అందజేసింది.