ఢిల్లీలోని ద్వారకకు చెందిన 34 ఏళ్ల మహిళకు ఫేస్‌బుక్‌లో.. లాట్స్ స్టార్ కిడ్స్ అనే సంస్థ పిల్లలకు మోడలింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఉన్న ఓ ప్రకటనను చూసింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పిల్లలు అనేసరికి ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పిపోతాం. మన పిల్లలు గొప్పగా కనిపించాలి. ఇంత అందంగా ఉంటారు...మన వాళ్లకి మోడలింగ్ కి వెళ్తే తప్పేంటి..అనుకుంటాం. ఇఫ్పుడు ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు ...కిడ్స్ మోడలింగ్ యాడ్స్ చాలా వస్తున్నాయి. బుట్టలో కాని పడ్డారా...డబ్బులు దొబ్బేస్తారు. జాగ్రత్త. సోషల్ మీడియా భూతం ...చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓకే చెయ్యండి. ఏదో చూద్దామని సరదాగా ట్రై చేస్తే మీ అకౌంట్ ఖాళీ అయిపోద్ది..అసలే డబ్బంతా ఇప్పుడు బీరువాలో కాదు ...ఫోన్లోనే ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఫస్ట్ క్రై వంటి ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌కి మీ చిన్నారుల ఫోటో షూట్స్ అవసరం ఉంటాయని. ఇందుకోసం మోడలింగ్ అవకాశాలు అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. తీరా ఓకే చేశాక ...మీ పిల్లల పిక్స్ పంపమని అడుగుతారు. ఓ ఇంట్రో వీడియో చెయ్యమని అడుగుతారు. అన్ని చేశాక ...ఎంట్రీ ఫీజు అంటూ డబ్బు కట్టమంటారు. కట్టాక ...మీ పిల్లలు సెలక్ట్ అయ్యారు. కాని చిన్న ఆల్బమ్ చెయ్యాలి. డబ్బు కట్టి ఫొటో షూట్ చేయించుకొండి ..మేమే చేస్తామంటూ ఏవో ప్యాకేజ్ లు కట్టిస్తారు. ఇక తర్వాత మీరు ఎంత ట్రై చేసినా ...ఫోన్ ఎత్తరు. ఆ సంస్థ ఎక్కడుందని మీరు వెళ్లలేరు.
తాజాగా ఢిల్లీలో ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ద్వారకకు చెందిన 34 ఏళ్ల మహిళకు ఫేస్‌బుక్‌లో.. లాట్స్ స్టార్ కిడ్స్ అనే సంస్థ పిల్లలకు మోడలింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఉన్న ఓ ప్రకటనను చూసింది. దీనితో పాటు మోడలింగ్‌లో శిక్షణ కూడా ఇస్తామని తెలిపింది. తన కుమార్తెకు ఇది మంచి అవకాశం అవుతుందని ఆమె భావించింది. వెంటనే సదరు మహిళ ఆ యాడ్‌పై క్లిక్ చేసింది. అది ఆమెను ‘టెలిగ్రామ్’కు తీసుకువెళ్లింది. ఆ తర్వాత ఫీజు చెల్లించింది.ఇలా 197 మంది తల్లిదండ్రుల నుంచి రూ.4.7 కోట్లకు పైగా మొత్తాన్ని వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.