Festivals in July 2024 : జూలై లో వచ్చే పండగలు ఇవే !

Published 2024-07-02 14:09:35

postImages/2024-07-02/1719909575_SJ11.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఆషాడమాసం ( ashada masam)  మొదలైందంటే ..పండుగల సీజన్ స్టార్ట్ అయినట్టే. వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయి. 

* జూలై 2 - యోగిని ఏకాదశి ( yogini ekadasi) 
నిర్జల ఏకాదశి తర్వాత జ్యేష్ట మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ రోజు ఏకాదశి నియమాలు పాటించి ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువును( maha vishnu) పూజించాలి. ద్వాదశి ఘడియలు ప్రారంభమైన తర్వాత అవి ముగిసిలోగా అన్నదానం చేసి ఉపవాసం విరమించాలి. ఈ రోజు విష్ణు ఆరాధన చాలా మంచిది. ఈ ఏకాదశి అక్షయతృతీయ అంత మంచిది. 


* జూలై 3 కూర్మ జయంతి
శ్రీ మహావిష్ణువు( mahavishnuvu) ఈ రోజే క్షీర సాగర మధనం చేశాడు . వాసుకుని తాడుగా..మందరగిరిని( mandara giri) కవ్వంగా చేసుకున్నారు కానీ..ఆ పర్వతం సముద్రంలోకి కుంగిపోతూ సాగరమథనానికి ఆంటంకం కలిగిస్తోంది. ఆ సమయంలో దేవతలంతా శ్రీ మహావిష్ణువును వేడుకోగా..తాబేలు రూపంలోకి మారి మందరగిరి నీటమునిగిపోకుండా చేశాడు శ్రీ మహావిష్ణువు. 


జూలై 4 మాస శివరాత్రి
ప్రతి నెలలో అమావాస్య ( amavasya)ముందురోజు వచ్చే చతుర్ధశిని మాసశివరాత్రి అంటారు. శంకరుడి జన్మతిథిని అనుసరించి జరుపుకునే ఈ తిథి రోజు ఉపవాసం ఉండి శివారాధన చేస్తే గ్రహ దోషాల నుంచి, దీర్ఘకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. జాతక దోషాలు ఉంటే ఈ రోజు పూజలు చేస్తే చాలు. జాతకదోషాలు పోతాయి. 


* జూలై 7 బోనాలు ప్రారంభం
ఆషాడం అనగానే తెలంగాణలో( telangana)  ...బోనాలు ( bonalu) మొదలవుతాయి. ముందుగా  గోల్కొండ జబదాంబిక అమ్మవారికి బంగారుబోనం సమర్పిస్తారు.  సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో నెలరోజుల పాటూ ప్రతి గురువారం, ఆదివారం పూజలు నిర్వహించి..మళ్లీ  గోల్గొండ కోటలోనే చివరి రోజు పూజ చేస్తారు. వర్షాలు, అంటురోగాల నుంచి ప్రజలను కాపాడాలని కోరుకుంటు అమ్మవారికి బోనాలు ఎత్తుతారు.


*7 వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు
ఆషాడ మాసంలో పాడ్యమి నుంచి నవమి ( జూలై 6 నుంచి 15) వరకూ  వారాహీ ( varahi navarathri) నవరాత్రులు నిర్వహిస్తారు. అమ్మవారిని పూజిస్తే శత్రుభయం తొలగిపోతుంది, వ్యవహార జయం, ఆరోగ్యం సిద్ధిస్తుంది.


 * జూలై 7 రథయాత్ర
 జగన్నాథుని( jaganatha ratha yatra)  రథయాత్ర జరిగేది కూడా జూలైలో వచ్చే ఆషాడమాసంలోనే. ఏడాది పాటూ గర్భగుడిలో కొలువైన జగన్నాథుడు తన సోదరి, సోదరుడితో కలసి బయటకు అడుగుపెట్టే అపురూప దృశ్యం. తొమ్మిది రోజులు జరిగే ఈ రథయాత్ర కన్నులపండుగగా జరుగుతుంది.


*జూలై 17 తొలి ఏకాదశి
ఉత్తరాయణ కాలం దేవతలకు పగలుగా.. దక్షిణాయన కాలం రాత్రిగా చెబుతారు పండితులు. మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే కాలం. 


*జూలై 21 గురు పూర్ణిమ
వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడిగా మారిన కృష్మద్వైపాయనుడు..వేదాలతో పాటూ మహాభారతం, భాగవతం, అష్టాదశపురాణాలు రచించాడు. గురుగ్రహ శాంతి కోసం ఈ రోజులు జరుపుతారు. గురువులకి...తమ శక్తి కొలది పూజలు జరుపుతారు.


*జూలై 24 వ తారీఖు సంకటహార చతుర్ధి
ప్రతి పౌర్ణమితర్వాత వచ్చే చతుర్ధి.  వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తూ...తాము చేసే ఏ పనికి కష్టాలు ఎదురవ్వకుండా చూడమని చేసే పూజ.