నిద్ర పట్టకపోవడం చాలా పెద్ద ఇబ్బంది. ఇది తెలుసుకునే లోపే ..మెంటల్ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అసలు ఈ మధ్య నిద్రపట్టడం లేదండి ..లేదా నేను చాలా తక్కువ నిద్రపోతాను..ఇలాంటి డైలాగ్స్ మనం వింటూనే ఉంటాం. కాని నిద్ర పట్టకపోవడం చాలా పెద్ద ఇబ్బంది. ఇది తెలుసుకునే లోపే ..మెంటల్ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి.
పిల్లలు : 14-17 గంటలు (మధ్యాహ్న నిద్రతో కలిపి)
ఏడాది లోపు పిల్లలు : 12-15 గంటలు (మధ్యాహ్న నిద్రతో కలిపి)
1-2 ఏళ్ల వయసున్న చిన్నారులు : 11-14 గంటలు (మధ్యాహ్న నిద్రతో కలిపి)
3-5 ఏళ్ల వయసున్న పిల్లలు : 10-13 గంటలు
పాఠశాలకు వెళ్లే పిల్లలు (6-12 ఏళ్లు) : 9-11 గంటలు
టీనేజర్లు (13-19 ఏళ్లు) : 8-10 గంటలు
పెద్దలు : 7-9 గంటలు
వృద్ధులు : 7-8 గంటలు
మీకు కాని నిద్రరావడం లేదు అంటే వెంటనే మీ రోజు వారి పనులు సరిగ్గా ప్లాన్ చేసుకొని ...మీ శరీరానిక కావాల్సిన నిద్రను బాడీకి ఇవ్వాల్సిందే. ప్రతి రోజు ఒకే తరహా నిద్ర సమయాల్ని పాటించాలి. వారాంతాలు, సెలవు రోజుల్లో కూడా నిర్ణీత వేళకే నిద్ర పోవడం, మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. కాని చాలా వరకు నిద్రలేమి స్ట్రెస్ వల్ల వస్తుంది. ముందు దేని కోసం ఎక్కువగా ఆలోచించకండి.
ఇంకా మధ్యాహ్నం ఎక్కువసేపు పడుకోవడం వల్ల కూడా రాత్రుళ్లు నిద్ర పట్టదని అంటున్నారు. వ్యాయామాల వల్ల ఆరోగ్యమే కాకుండా.. నిద్ర సమయాలు కూడా అదుపులో ఉంటాయని నిపుణులు అంటున్నారు. పిజికల్ ఎక్సర్ సైజులు కాని చేస్తే మీ శరీరానికి నిద్రకు కావాల్సిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు నిద్ర బాగా పడుతుంది. పాలు, పాల పదార్థాలు, బాదం, కివీ పండ్లు, చామొమైల్ టీ వంటివి తరచూ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.