దారిద్యరేఖకు దిగువన ఉన్నవారికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు. అయితే చాలా మందికి ఈ పథకం ఎలా అప్లై చెయ్యాలో తెలీదు . అయితే తెలుసుకుందాం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దీర్ఘకాలిక వ్యాధులు , ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పేదలను సీఎంఆర్ ఎప్ ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుంది. వైద్యచికిత్స కోసం కొంత మేర ఆర్ధిక సహాయాన్ని కూడా అందిస్తుంది. అయితే ఇది సమాజంలో బడుగు , బలహీన వర్గాలు , తెల్లరేషన్ కార్డుదారులకు , దారిద్యరేఖకు దిగువన ఉన్నవారికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు. అయితే చాలా మందికి ఈ పథకం ఎలా అప్లై చెయ్యాలో తెలీదు . అయితే తెలుసుకుందాం.
ఆరోగ్యశ్రీ పథకం ఉన్నప్పటికీ అన్ని జబ్బులు వాటి పరిధిలోకి రావు. అలాంటి టైంలో కొన్ని రకాల వ్యాధులకు డబ్బు ఖర్చు చెయ్యాల్సి వస్తుంది. అలాంటప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మీరు కొన్ని రకాల షరతులతో డబ్బును పొందవచ్చు. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత సంబంధిత ఖర్చులను తగిన బిల్లలను సమర్పించి సీఎం సహాయనిధి పొందవచ్చు.
సీఎం రిలీఫ్ ఫండ్ కు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అవసరం .
* హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రం
* పేషెంట్ డిశ్ఛార్జి సమ్మరి
* బ్యాంక్ అకౌంట్ నెంబర్
* రేషన్ కార్డు వివరాలు
* ఇన్ఫేషెంట్ వివరాలు
అయితే పైన తెలిపిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్న తర్వాత స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు లేఖను జత చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పూర్తిస్థాయి వివరాలను డెక్యుమెంట్స్ ను ఎమ్మెల్యే ఆఫీస్ కు సమర్పించాలి. ఆయన పర్సనల్ అసిస్టెంట్ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆ డెక్యుమెంట్స్ పంపుతారు. అప్పుడు వారు అంక్వెయిరీ చేసుకొని మూడు , నాలుగు నెలలకు మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ను సాంక్షన్ చేస్తారు. అది కూడా ఖర్చు చేసిన డబ్బుల్లో కొంతమేర పేషెంట్ పేరిట చెక్కు రూపంలో రిలీజ్ చేస్తారు.