మీరు కాని ప్రేమను చెప్తే తను సంతోషిస్తుంది. మీ అమ్మ హ్యాపీగా ఉండాలంటే ఓ సారి మీ ప్రేమను చెప్పి చూడండి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : " అమ్మ" అసలు ఈ పదాన్ని వర్ణించడం చాలా కష్టం. సృష్టినంతా వర్ణించడం ఎంత కష్టమో...అమ్మ వర్ణించడం అంత కష్టం. తియ్యనది ..ప్రేమ , దయ , కరుణ ఏం లేవు అమ్మలో..తనను తను పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. చాలామంది అంటుంటారు..ఈ ఒక్క రోజు తల్లి మీద ప్రేమ కురిపించేయడం కాదు ..రోజు చూపించాలని ..నిజమే రోజు ప్రేమ ఉండాలి..ఈ ఒక్క రోజు మాత్రం ఆ ప్రేమను బయటపెట్టాలి. మీ ప్రేమను బయటపెట్టకపోయినా మీ మధర్ మిమ్మల్ని ఇష్టపడుతుంది. కాని మీరు కాని ప్రేమను చెప్తే తను సంతోషిస్తుంది. మీ అమ్మ హ్యాపీగా ఉండాలంటే ఓ సారి మీ ప్రేమను చెప్పి చూడండి.
ప్రతి సంవత్సరం మే నెలలో రెండో ఆదివారం రోజు మదర్స్ డేను జరుపుకుంటాము. ఈ ఏడాది మే 11వ తేదీన మదర్స్ డే చేసుకుంటారు. అసలు ఈ నెలలోనే ఎందుకు మధర్స్ డే చేసుకుంటారు అంటే గ్రీస్ లో రియా అనే దేవతను మదర్ ఆప్ గాడ్స్ గా భావించి సంవత్సరానికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరుతో ఉత్సావాన్ని జరుపుకునేవారు. 1872 లో జూలియవర్డ్ హోవే అనే మహిళ అమెరికా లో తొలిసారి ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. ఈ మేరీ జర్విస్ అనే మహిళ మదర్స్ ప్రెండ్ షిప్ డే జరుపుకునేందుకు ఎంతో కృషి చేసింది.
మేరీ జర్విస్ మే 9వ తేదీ రెండవ ఆదివారం నాడు మరణించింది. ఈ కారణంగానే తన కూతురు ఆమె కోసం ఈ మధర్స్ డే ను జరుపుకుంటున్నారు. 1911లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ఏటా మే రెండవ ఆదివారం రోజు మాతృదినోత్సవం అధికారికంగా జరుపుకోవాలంటూ నిర్ణయించారు. అలా అలా ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డే జరుపుకుంటున్నారు. మీరు ప్రత్యేకమైన ప్రేమను చూపించాల్సిన అవసరం లేదు..చిన్న చిన్న పనుల్లో సాయం చెయ్యండి. మీ అమ్మతో రోజులో కాసేపు మాట్లాడండి. ముఖ్యంగా మగవారు...మీ బాధ్యతలు ఎప్పుడూ ఉంటాయి. కాని ఒక్కసారి తల్లి అనే మనిషి లేకపోతే ..మీరు ఏం కోల్పోతారో తెలుసా ...మీ బాల్యం...మిమ్మల్ని చిన్నపిల్లల్లా చూసే వారు ఇక ఈ ప్రపంచంలో ఉండరు. ఉన్నపుడే తల్లి విలువ తెలుసుకొండి. హ్యాపీ మదర్స్ డే .