india: సైనికులు యుధ్ధం చేస్తే ప్రజలకు ఎందుకు మాక్ డ్రిల్ ..ఎందుకు తెలుసుకోవాలి !

ఈ మాక్ డ్రిల్స్ ప్రజలను మరింత భయపెడతాయి కదా..ఎందుకు ఇవి ప్రజలకు అవసరమా లాంటివి తెలుసుకుందాం. 


Published May 06, 2025 08:22:00 PM
postImages/2025-05-06/1746543313_PTI04172025000044A017464907189421746490739943.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఇండియా , పాకిస్థాన్ గొడవ రోజు రోజుకు నిప్పు రాజుకుంటుంది. ఏ క్షణమైనా యుధ్ధమే అన్నట్లు ప్రతి క్షణం ఉత్కంఠ గా ఉంది. దేశ రక్షణ అంటే బోర్డర్ లో ఉండే వారి కోసమే కదా మరి ప్రభుత్వం ఎందుకు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేస్తుంది అంటూ చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. అయితే ఈ మాక్ డ్రిల్స్ ప్రజలను మరింత భయపెడతాయి కదా..ఎందుకు ఇవి ప్రజలకు అవసరమా లాంటివి తెలుసుకుందాం. 


ఇండియా పాకిస్తాన్ బోర్డర్ కి, హైదరాబాద్ – విశాఖపట్నం లాంటి నగరాలకి చాలా దూరం ఉంది. యుధ్ధం మొదలైదే సైన్యాన్ని దాటుకొని ఇంత దూరం పాకిస్థాన్ సైన్యం రాలేదనే అనుకుందాం. కాని ఎందుకు మాక్ డ్రిల్ అంటే యుధ్ధం జరిగితే ...సైన్యం వేసే ఎత్తుగడలు ఎలా ఉంటాయనేది ఈ మాక్ డ్రిల్స్ లో చెబుతారు. ఇలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక వీడియో రిలీజ్ చేసింది. కొన్ని సార్లు మీ రక్షణ మీపై కూడా ఆధారపడి ఉంటుందనేది భారత్ ప్రభుత్వం ఉద్దేశ్యం. అలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలనేదే ఈ మాక్ డ్రిల్. 


భారత్ ప్రభుత్వం ఎయిర్ రైడ్ అలారం అంటే మనం ఫ్యాక్టరీల్లో సైరన్లు మోగినట్టు పెద్దగా మోగుతాయి. ఆ టైం లో వెంటనే ఇంట్లో అంతా చీకటి గా చెయ్యాలి. వెంటనే అలర్ట్ అయిపోవాలి. ఆఫీసులో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, మార్కెట్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పిల్లలు ఆడుకుంటున్నా.. ఏ స్థితిలో ఉన్నా కూడా వెంటనే అలర్ట్ అవ్వాలి. ప్రభుత్వం చెప్పినట్టుగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలి. వెంటనే బ్లాక్ ఔట్ అవ్వాలి. అంటే ఇళ్లంతా చీకటి చెయ్యాలి. అప్పుడే ఎక్కడైనా వెలుగు గమనిస్తే అక్కడ ప్రత్యర్థి బాంబ్స్ తో ఎటాక్ చేసే ప్రమాదం ఉండొచ్చు.


పై నుంచి చూస్తే చీకటిగా ఉంటుంది. మీరు లైట్స్ ఆన్ చేస్తే జనాలు ఉంటే ప్లేస్ గా గుర్తించి బాంబ్స్ వేస్తారు. కాబట్టి బ్లాక్ ఔట్ అవ్వాలి. ఒక్క లైట్ కనిపించినా ..భారీ నష్టం చూడాల్సి వస్తుంది. సో ఇలాంటి విషయాలు తెలియడానికే మాక్ డ్రిల్ . 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu india pakistan indian-army

Related Articles