ఆర్టీసీ బస్సులు, ప్రాంగణాల్లో కామెడీల పేరుతో సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడాన్ని ఏమాత్రం సహించేది లేదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ గట్టిగా హెచ్చరించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశలో చాలా మంది యూత్ కి రీల్స్ రోగం పట్టుకుంది. ఎవరు ఎలా పోయినా ..మాయదారి జనం రీల్స్ తీసే పనిలో పడ్డారు. పిచ్చి చేష్టలు చెయ్యడం ప్రాంక్ పేరుతో సొసైటీని డిస్టర్బ్ చెయ్యడం కామన్ అయిపోయింది.అయితే ఇలాంటి వారిపై ఫుల్ అయ్యారు సజ్జనార్ .తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు, ప్రాంగణాల్లో కామెడీల పేరుతో సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడాన్ని ఏమాత్రం సహించేది లేదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ గట్టిగా హెచ్చరించారు.
ఇలాంటి వెర్రికామెడీలతో ఎంతో కష్టపడి , అంకితభావంతో పనిచేసుకుంటున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచెయ్యడం సరైనది కాదని అన్నారు. కండక్టర్ తో ఓ యువకుడు ప్రాంక్ చేస్తున్న వీడియోను సజ్జనార్ పంచుకున్నారు. మీరు ఫేమస్ అవ్వాలంటే మీరే జోకర్లు అవ్వండి...కాని పక్కవారిని ఇన్సల్ట్ చేసి నవ్వుకునే హక్కు మీకు లేదని సీరియస్ అయ్యారు. రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదని, బాధ్యతాయుతంగా మెలగాలని ఆయన సూచించారు.
ఇదేం వెర్రి కామెడీ!?
సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!?
కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఏమాత్రం… pic.twitter.com/OBXeqmCZRp — V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 15, 2025