DIET: హెల్దీ ఉండాలనుకుంటున్నారా ..ఇలా తింటే 70 ఏళ్లు గ్యారెంటీ !

సాయంత్రం పక్షులు గూళ్లకు చేరే సమయానికి మన భోజనం కంప్లీట్ అయిపోవాలి. అప్పుడు మనం హెల్దీ గా ఉంటాం, కాని మనం ఏం చేస్తున్నాం.


Published Apr 26, 2025 11:43:00 PM
postImages/2025-04-26/1745691268_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తిండి మనకి కొత్తేం కాదు. అలాగే డైటింగ్ కూడా కాని ఇప్పుడున్న తిండి మనకు కొత్తే. చాలా యేళ్లుగా మన పెద్దలు , డాక్టర్లు చెబుతున్నది ఒక్కటే . ఆరోగ్యంగా ఎక్కువ రోజులు బ్రతకాలంటే మితిమీరిన తిండి తినకండి. ఇదే సూత్రం అతి పనికి రాదు తిండిని కంట్రోల్ చేసుకొండి. ఇప్పుడు మనం చేస్తున్న పనికి మనం తినే తిండికి సంబంధం లేదు. మనం చేసే పనికి ఒక్క పూట హెల్దీగా తింటే సరిపోతుంది. సాయంత్రం పక్షులు గూళ్లకు చేరే సమయానికి మన భోజనం కంప్లీట్ అయిపోవాలి. అప్పుడు మనం హెల్దీ గా ఉంటాం, కాని మనం ఏం చేస్తున్నాం. పొద్దున్న లైట్ గా రెండు ఇడ్లీలు..మధ్యాహ్నం చిన్న లంచ్ బాక్స్ లో భోజనం ...రాత్రికి మాత్రం పెద్ద పొట్లంతో బిర్యానీ ఈ అలవాట్లు మానుకుంటే ఆరోగ్యం గా ఉంటాం. అయితే ఈ మధ్య మైండ్ డైట్ చాలా ట్రెండింగ్ లో ఉంది అదేంటో చూసేద్దాం.


మైండ్ డైట్‌లో బాగంగా వారంలో క‌నీసం 6 సార్లు కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌ను తినాలి, వారంలో క‌నీసం 2 సార్లు బెర్రీల‌ను తినాలి. వారంలో క‌నీసం 5 సార్లు న‌ట్స్‌ను తీసుకోవాలి. రోజూ ఆలివ్ ఆయిల్‌ను వంట‌ల‌కు క‌చ్చితంగా ఉప‌యోగించాలి. ఓట్ మీల్‌, బ్రౌన్ రైస్‌ను వారంలో క‌నీసం 3 సార్లు తినాలి. వారానికి ఒక‌సారి చేప‌ల‌ను క‌చ్చితంగా తినాలి. వారంలో 3 సార్లు బీన్స్‌, వారానికి 2 సార్లు చికెన్ లేదా కోడిగుడ్లు తినాలి. అయితే కుదిరితే మీకు నచ్చితే వైన్ తాగచ్చు.
ఇంతకీ ఏం తినకూడదంటే ....


మటన్ తినకూడదు. 


వెన్న‌, నెయ్యి రోజుకు ఒక టీస్పూన్ మించ‌కూడ‌దు. 


చీజ్‌ను వారంలో ఒక‌సారి మాత్ర‌మే తిన‌వ‌చ్చు. 


పేస్ట్రీలు, స్వీట్ల‌ను కూడా వారంలో ఒక‌సారి మాత్ర‌మే తినాలి. 


వేపుళ్ల‌ను కూడా వారంలో ఒక‌సారి మించి తిన‌కూడ‌దు. 


వీటిని పాటిస్తే మీకు సడన్ స్ట్రోక్స్ రావు. నిద్రలో గుండెపోటు కాని అల్జీమర్స్ లాంటి రోగాలు రాకుండా ఉంటాయి,
 

newsline-whatsapp-channel
Tags : health food, heart-problems diabetes-control

Related Articles