అరగంట నుంచి ఆరేడు గంటల వరకు రైళ్లు ఆలస్యంగా నడిచిన సందర్భాలు కోకొల్లలు. రెండు ట్రైన్లు కాని రిజర్వేషన్లు కాని చేయించుకునే రెండో రైలు క్యాచ్ చేసే వరకు భయమే.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మన దేశంలో రైళ్లు ఆలస్యానికి పెట్టింది పేరు. దీని పై చాలా జోకులు కూడా వచ్చాయి. కాని ట్రైన్ ఆలస్యంగా వచ్చిన రైలు మధ్యమధ్యలో ఆగుతూ మరింత ఆలస్యం చేసి ఎప్పటికో వస్తాయి. అరగంట నుంచి ఆరేడు గంటల వరకు రైళ్లు ఆలస్యంగా నడిచిన సందర్భాలు కోకొల్లలు. రెండు ట్రైన్లు కాని రిజర్వేషన్లు కాని చేయించుకునే రెండో రైలు క్యాచ్ చేసే వరకు భయమే. పొరపాటున రైలు లేటుగా వచ్చి మరో రైలు కాని మిస్ అయితే కేసులు వెయ్యొచ్చు ఎలానో చూసేద్దాం రండి.
* జనరల్ బోగీలో ప్రయాణించే వారికి కేసు వేసే అవకాశం లేదు. రిజర్వుడు బోగీలో ప్రయాణించే వారికే అవకాశం.
ఎందుకంటే రిజర్వేషన్ చేయించుకునే వారికి మాత్రం ఈ అవకాశం ..సీటు వారు ఆ ప్రయాణానికి కేటాయించినందుకు డబ్బులు చెల్లించారు.
* రైలు కనీసం 3 గంటలకు పైగా ఆలస్యం అయిన సందర్భంలోనే కేసు వేయొచ్చు. రైలు మినిమం 2 గంటల పాటు మాత్రమే లేటు వస్తుంది. మరింత లేటు అయితే మీరు కేసు వేసుకోవచ్చు.
* ఆలస్యానికి కారణాలను రైల్వే ముందే చెప్పినా లేక ప్రయాణ సమయంలో చెప్పినా రైల్వే శాఖ బాధ్యత ఉండదు. అందుకే మనకు ముందే రైలు లేటు అనే మెసేజ్ ను పంపుతారు.
* ఎలాంటి కారణం చెప్పకుండా ఉంటే మాత్రం రిజర్వుడు టికెట్ ను సాక్ష్యంగా చూపుతూ ఫోరంలో కేసు వేసి పరిహారం పొందవచ్చు.
* ప్రమాదాలు, పకృతి వైపరీత్యాల కారణంగా ఆలస్యమైతే మాత్రం రైల్వే శాఖ టికెట్ డబ్బులను వాపస్ చేస్తుంది.