అధికారిక వెబ్‌సైట్ (pminternship.mca.gov.in) విజిట్ చేసి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. రెండో దశ పీఎం ఇంటర్న్‌షిప్‌లో మొత్తం ఒక లక్ష మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : MCA PM ఇంటర్న్ షిప్ స్కీమ్ 2025 రిజిస్ట్రేషన్ గడువును మార్చి 31 వరకు పొడిగించింది. అర్హత ఉన్న అభ్యర్ధులు చాలా రంగాల్లో ఇంటర్న్ షిప్ లకు అప్లయ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ (pminternship.mca.gov.in) విజిట్ చేసి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. రెండో దశ పీఎం ఇంటర్న్‌షిప్‌లో మొత్తం ఒక లక్ష మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
గతంలో దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 12, 2025 ఉండగా, ఇప్పుడు మార్చి 31, 2025 వరకు పొడిగించారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ స్కీమ్ యాప్ ను ప్రారంభిచారు. దేశంలోని టాప్-500 కంపెనీలలో ఇంటర్న్‌షిప్‌లను ప్రారంభించవచ్చు. దీనికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పీఎం ఇంటర్న్ షిప్ పథకంతో భారత్ లో ఇతర నైపుణ్యాభివృధ్ధి , అప్రెంటిస్ షిప్ , ఇంటర్న్ షిప్ , స్టూడెంట్ ట్రైనింగ్ స్కీమ్ లతో సంబంధం లేదు. మొత్తం 12 నెలల పాటు ఈ ఇంటర్న్ షిప్ ప్రొగ్రామ్ ఉంటుంది.
అభ్యర్థులు హైస్కూల్, హయ్యర్ సెకండరీ స్కూల్, ITI సర్టిఫికేట్, పాలిటెక్నిక్ కాలేజీ నుంచి డిప్లొమా లేదా BA, B.Sc, B.Com, BCA, BBA, B.Pharma మొదలైన డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థులు 21ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
ఖచ్చితంగా భారత దేశ పౌరుడు అయ్యి ఉండాలి .
దరఖాస్తుదారులు ఫుల్ టైమ్ జాబ్ చేయకూడదు. ఫుల్ టైమ్ స్టడీ చేస్తూ ఉండకూడదు.
కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల కన్నా ఎక్కువ ఉన్నవారు ఈ స్కీమ్ కు అనర్హులు.
ఇంట్లో ఎవ్వరికి గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు.
మీ మొబైల్ నంబర్‌తో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో మీ ప్రొఫైల్ పూర్తి వివరాలను ఎంటర్ చేయండి.
మీ ఇన్‌పుట్ డేటా ఆధారంగా సిస్టమ్ రెజ్యూమ్‌ను క్రియేట్ చేస్తుంది.
లొకేషన్, ఇండస్ట్రీ, రోల్, అర్హతల వారీగా 5 ఇంటర్న్‌షిప్ అవకాశాలను ఎంచుకోండి.
మీ అప్లికేషన్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్లను కూడా అప్‌లోడ్ చేయాలి.
మీ దరఖాస్తు ఫారమ్‌ను చెక్ చేసి Submit చేయండి.
ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ హార్డ్ కాపీని ప్రింటవుట్ తీసుకోండి.