DE HYDRATION : డీ హైడ్రేషన్ కు బెస్ట్ .. సొల్యుషన్ ..ట్రై చెయ్యండి !

కూల్ డ్రింక్స్ కాకుండా నేచురల్ గా ఒంటికి చలువ చేసేవి ప్రయత్నించాలి. ఈ రోజు అలా డీహైడ్రేషన్ కు చెక్ పెట్టేవి ట్రై చేద్దాం.


Published Mar 20, 2025 05:33:00 PM
postImages/2025-03-20/1742472229_sddefault.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఎండలు మొదలయ్యాయి. ఇంకా మార్చి నెలలే అయినా ఎండలు 40 డిగ్రీలకు దగ్గరవుతున్నాయి. తెల్లారితే చాలు సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. అయితే ఈ టైంలో పిల్లలకు డీహైడ్రేషన్ సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఆహారం ప్రత్యేకమైన శ్రధ్ధ తీసుకోవాల్సిందే. కూల్ డ్రింక్స్ కాకుండా నేచురల్ గా ఒంటికి చలువ చేసేవి ప్రయత్నించాలి. ఈ రోజు అలా డీహైడ్రేషన్ కు చెక్ పెట్టేవి ట్రై చేద్దాం.


కావాల్సిన పదార్థాలు:


జొన్న పిండి - 2 టేబుల్​ స్పూన్లు


నీళ్లు - సరిపడా


ఉప్పు - రుచికి సరిపడా


ఓ బౌల్​లోకి జొన్న పిండి తీసుకొండి . ఇందులోకి పావు లీటర్​ నీళ్లు పోసి ఉండలు లేకుండా మిక్స్​ చేసుకోవాలి. రాత్రంతా నానబెట్టి దీనిని పులియబెట్టి ఉంచుకొండి.ఉదయం ఈ జావ తాగాలనుకున్నవారు ముందు రోజు రాత్రే పిండిని నానబెట్టాలి. సాయంత్రం కావాలనుకున్నవారు అదే రోజు ఉదయం నానబెడితే సరి. ఇలా నానబెట్టి ఉన్న దానాని మనం రాగి అంబలి ఎలా చేసుకుంటామో అలా చిక్కబడే వరకు మరిగించుకొని ఉంచుకోవాలి.


జొన్న పిండి ఉడుకుతున్నప్పుడు పైన నురగ వస్తుంది. దానిని తీసేసుకోవాలి. జావ లైట్​గా చిక్కగా మారేవరకు మరిగించుకోవాలి. మీకు జావ తయారవ్వడం క్లియర్ గా  తెలుస్తుంది.ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు గ్లాసులోకి పోసుకుని తాగితే సరి. ఎంతో రుచికరంగా మరెంతో ఆరోగ్యకరమైన జొన్న జావ రెడీ. నచ్చితే మీరూ ఈ సమ్మర్​లో ట్రై చేయండి.

newsline-whatsapp-channel
Tags : health-benifits health-problems ragi-java

Related Articles