ఓటు హక్కు అనేది సామాన్యుని చేతిలో ఉన్న వజ్రాయుధం . కాబట్టి మీ హక్కును ముందు సెక్యూర్ చేసుకొండి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఎన్నికలు వస్తేనే కాని మేజర్ల గురించి ఎవరు పట్టించుకోరు అది మన అతి పెద్ద ప్రజాస్వామ్య భారత్ . కాని మేజర్ అవ్వగానే ...మనకు మనమే చెయ్యాల్సిన కొన్ని పనులు ఉన్నాయి.ఓటు హక్కు అనేది సామాన్యుని చేతిలో ఉన్న వజ్రాయుధం . కాబట్టి మీ హక్కును ముందు సెక్యూర్ చేసుకొండి.
ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి నూతనంగా ఓటరు నమోదుకు గతంలో ఎలక్షన్ కమిషన్ జనవరి ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండిన వారిని మాత్రమే అవకాశం కల్పించేది. కాని ఇప్పుడు ప్రతి ఏటా 4 సార్లు జనవరి , ఏప్రిల్ , జూలై , అక్టోబర్ ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండిన వారికి ఓటరుగా నమోదు చేసుకునే సౌలభ్యం కల్పించింది. ఈ ఏప్రిల్ ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటరు నమోదుకు అర్హులు.
* 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఫారం -6: 18 ఏళ్లు నిండిన వారు కొత్త గా ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చు.
* ఫారం-7 : స్థానికంగా లేని ఓటర్ల పేర్లను తొలగించేందుకు ఈ ఫారంని ఉపయోగిస్తారు. వలస వెళ్లిన వారు (మైగ్రేటెడ్), రెండు చోట్ల పేరున్న వారు, చనిపోయిన వారి పేర్లను తొలగించుకోవచ్చు.
* అంతేకాదు ఓటర్ ఐడీ లో మీ పేరు , తేదీ , అడ్రస్ వంటివి సవరించుకోవచ్చు . ఒక పోలింగ్ సెంటర్ నుంచి మరో కేంద్రానికి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
* ఆఫ్లైన్లో స్థానిక బీఎల్వో, తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.