IDLY : రెడిమేడ్ బ్రేక్ ఫాస్ట్ ప్యాకెట్స్ కొంటున్నారా ...హెల్త్ జాగ్రత్త

Published 2024-07-02 19:58:01
postImages/2024-07-02/1719930481_IdliDosaBatterWb.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొంతమంది షాపింగ్ మాల్స్ ( SHOPPING MALLS)  ఈజీ గా దొరికే రెడీ మేడ్ ..ఇడ్లీ , దోశ( IDLY DOSA PACKETS)  ప్యాకెట్లు కొనేస్తుంటారు. కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా...ఏం చేస్తారు...ఈ రుబ్బు పాడవకుండా..ఎలా నిల్వ చేస్తారు ఆలోచించారా..చాలా డేంజరస్ కెమికల్స్( CHEMICALS)  వాడి వాటిని నిల్వ చేస్తారట. ఇందులో బోరిక్ యాసిడ్ కలపడం వల్ల ఈ రుబ్బు ఎన్ని రోజులైనా  నిల్వ ఉంటాయి.


ఇడ్లీ, దోశ పిండి ప్యాకెట్స్ నిల్వ చేసేందుకు, అవి పుల్లగా మారకుండా ఉండేందుకు బోరిక్ యాసిడ్ వేస్తారు. ఈ ప్యాకెట్స్‌ని బోరిక్ యాసిడ్‌తో కోటింగ్ చేసి ఆ తర్వాత అందులో పిండిని వేస్తారు.  అసలు ఈ బోరిక్ యాసిడ్ తినడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. బోరిక్ ( BORIC ACID) యాసిడ్ వల్ల పేగులు ఎఫెక్ట్ అవుతాయి. కడుపు నొప్పి పెరుగుతుంది. అజీర్తి వంటి సమస్యలొస్తాయి.


ప్యాకెట్స్ చేస్తున్నపుడు మాత్రం ...ఎలాంటి నీరును వాడతారో తెలీదు...కలుషిత నీరు..బోరిక్ యాసిడ్ ఇవన్నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కలుషిత నీటి ద్వారా .. ఎకోలీ బ్యాక్టీరియా పెరిగి కడుపునొప్పి, శరీరం పొడిబారడం, విరోచనాలు, పేగు, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలొస్తాయి.