Alert:మార్నింగ్ లేచిన వెంటనే  ఈ సమస్య ఉంటే ప్రమాదమే.!

Published 2024-07-04 20:23:50

postImages/2024-07-04/1720104830_braintumar.jpg

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా ఉదయం లేవగానే చాలామందికి అలసట ఉంటుంది. దీనికి ప్రధాన కారణం మన శరీరంలో జరిగే మార్పులు. ఉదయం లేచిన వెంటనే మీ శరీరంలో ఇలాంటి మార్పులు కనిపించాయి అంటే తప్పక మీకు ఉన్నట్టే. మరి ఆ సమస్యలేంటి.. వివరాలు చూద్దాం.  అయితే కొంతమంది ఈ సమస్యలను నెగ్లెట్ చేస్తూ ఉంటారు.  చిన్న సమస్య తగ్గిపోతుందిలే అనుకుంటారు. కానీ అది మొదటికే మోసం వస్తుంది. చివరికి అది తీవ్రమైన అనారోగ్య సమస్యగా దారితిస్తుంది.

 ఈ సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తలనొప్పి.  ఉదయం లేవగానే  తలనొప్పితో పాటు, వాంతులు, వికారంగా ఉంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఈ సమస్య చిన్నదిగానే కనిపిస్తుంది కానీ రెగ్యులర్ గా ఉంటే మాత్రం తప్పకుండా బ్రెయిన్ ట్యూమర్ కు దారితిస్తుందట. దీనికి ప్రధాన కారణం తలనొప్పి. ఇది ఎక్కువైతే  మెదడులో కణితి ఏర్పడి ఈ లక్షణాలను ప్రేరేపిస్తుందట.

 మెదడులోని కణజాలాల్లో  కణాలు అసాధారణంగా పెరిగిపోయి కణితులకు దారితీస్తాయి.  ఈ ట్యూమర్లని ప్రైమరీ ట్యూమర్లని,  ఇతర భాగాలకు వ్యాప్తి చెందితే  సెకండరీ ట్యూమర్ అని, దీనివల్లే ఉదయం లేవగానే వాంతులు, తలనొప్పి, వికారం వంటి లక్షణాలు వస్తాయట.  దీన్ని మనం నెగ్లెట్ చేస్తే మతిమరుపు దృష్టిలోపం మన ప్రవర్తనలో మార్పు, మూర్ఛ,  తిమ్మిరి వంటివి వస్తాయట. ఈ లక్షణాలు కనిపిస్తే  వైద్యుల దగ్గరికి వెళ్లాలని అంటున్నారు.