SALAR JUNG MUSEUM: మీ ఇంట్లో నుంచే సాలర్ జంగర్ మ్యూజియం చూడొచ్చు !

గూగుల్ . ఆర్ట్స్‌, కల్చర్‌లో భాగంగా ప్రఖ్యాత సాలార్‌జంగ్‌ మ్యూజియానికీ చోటు కల్పించింది. అక్కడి అరుదైన వస్తువుల ప్రత్యేకతలను వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. 


Published Feb 06, 2025 03:59:00 PM
postImages/2025-02-06/1738837936_unnamed.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హైదరాబాద్ వెళ్తే సాలర్ జంగ్ మ్యూజియం చూడకుండా ఉండరు. ఇలాంటి వారి కోసం సాలర్ జంగ్ మ్యూజియం ను ఇంట్లోనే ఉండి చూసే ఏర్పాట్లు చేస్తుంది గూగుల్ . ఆర్ట్స్‌, కల్చర్‌లో భాగంగా ప్రఖ్యాత సాలార్‌జంగ్‌ మ్యూజియానికీ చోటు కల్పించింది. అక్కడి అరుదైన వస్తువుల ప్రత్యేకతలను వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. 


మ్యూజియంలో భద్రపరిచిన సింబల్స్‌ ఆఫ్‌ గ్రోరీ పేరుతో రాజుల దర్పం ప్రతిబింబించేలా సుమారు వెయ్యికి పైగా అరుదైన, ప్రాచీన వస్తువులు వెబ్‌సైట్లో నిక్షిప్తం చేశారు.అయితే వండర్స్ ఆఫ్ ఫుడ్ పేరుతో నాడు రాజులు  ఆడిన చెస్ బోర్డు , రెండో నిజాం సాహస యాత్ర రాయల్ దక్కని కళా పోషణకు వివరాలను డిజిటలైజ్ చేశారు. 


మ్యూజిక్ ఆఫ్‌ బ్రాంజ్‌, ఇండియన్‌ ఎపిక్స్ ఇన్‌ ఆర్ట్స్‌, ఎ గేమ్ ఆఫ్ థ్రోన్స్‌, హౌ చెస్‌ కాంకర్డ్‌ వరల్డ్‌, భారతదేశ, తెలంగాణ, నిజాం చరిత్రకు సంబంధించిన 1,000పైగా చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని కింది ఉన్న సైట్ లో చూడవచ్చు. https://artsandculture.google.com/partner/salar-jung-museum లో చూడవచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే వివిధ రకాల వస్తువులు కనిపిస్తాయి. కావాల్సిన దానిపై నొక్కగానే ఆ వస్తువుకు సంబంధించిన మొత్తం సమాచారం వస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu google-voice

Related Articles