Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి చుట్టు పరదాలు.. !

అవాంఛిత సంఘటనలు జరగకుండా తెల్లటి పరదాలను ఏర్పాటు చేశారు. ఆయన నివాసం వద్ద... బయటి వ్యక్తులకు లోపల కనిపించకుండా తెల్లటి గుడ్డలను ఇంటి చుట్టూ కట్టారు. 


Published Dec 24, 2024 05:49:00 PM
postImages/2024-12-24/1735042938_AlluArjun.jpg3.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సినీనటుడు అల్లు అర్జున్ ఇంటి చుట్టూ అధికారులు పరదాలు ఏర్పాటు చేశారు.. రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు దాడికి దిగారు. ఈరోజు పోలీసులు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారించారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన ఇంటికి చేరుకున్నారు.ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు... అవాంఛిత సంఘటనలు జరగకుండా తెల్లటి పరదాలను ఏర్పాటు చేశారు. ఆయన నివాసం వద్ద... బయటి వ్యక్తులకు లోపల కనిపించకుండా తెల్లటి గుడ్డలను ఇంటి చుట్టూ కట్టారు. 


ఇక పై అల్లుఅర్జున్ ఇంటి ఆవరణ ఏదీ మీడియా కు కాని పోలీసులకు కాని తెలీదు. ఈ పరదాలు ఏర్పాటు చేయడంతో సెక్యూరిటీ మరింత టైట్ చేశారు అధికారులు. అంతేకాదు ఎలాంటి అనవసరమైన రచ్చ జరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఒకవైపు చిక్కడపల్లిలోని పోలీస్​ స్టేషన్​లో అల్లు అర్జున్ విచారణ జరుగుతున్నప్పుడే ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన విచారణ ముగిసింది. అనంతరం తన ఇంటికి అల్లు అర్జున్ వెళ్లిపోయారు. దీంతో ఆయన ఇంటి చుట్టూ తెల్లటి పరదాలు ఏర్పాటు చేశారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news allu-arjun

Related Articles