travel: సోలో ట్రావల్ వల్ల ఎన్ని లాభాలో ..మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది !

నచ్చిన ప్లేసుకు ప్రయాణాలు చేస్తూ ఉంటే మీ హెల్త్ కు చాలా హెల్ప్ చేస్తాయంటున్నారు సర్వేలు.ఒంటరిగా ప్రయాణాలు చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే ఈరోజే మీరు భుజానికి బ్యాగ్ వేసుకుంటారు.


Published Jan 04, 2025 02:36:00 PM
postImages/2025-01-04/1735981689_solotraveller.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొంతమంది ఒక దగ్గర కూల్ గా కూర్చోలేరు.  వారికి ఒకే దగ్గర ఉంటే ఊపిరి ఆడలేనట్టు ఉంటుంది. నచ్చిన ప్లేసుకు ప్రయాణాలు చేస్తూ ఉంటే మీ హెల్త్ కు చాలా హెల్ప్ చేస్తాయంటున్నారు సర్వేలు.ఒంటరిగా ప్రయాణాలు చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే ఈరోజే మీరు భుజానికి బ్యాగ్ వేసుకుంటారు.


* ఒంటరి ప్రయాణంలో ఎప్పుడు ప్రశాంతంత లభిస్తుంది. అక్కడికి వద్దు, ఇక్కడికి వద్దు అనే నిబంధనలు ఉండవు. మీకు అడ్డు చెప్పేవాళ్ళే ఉండరు. మీకు నచ్చిన ప్లేసులో నచ్చినంత సేపు ఉండొచ్చు. 


* ఖర్చులు తక్కువగా అవుతాయి. కారణం వేరే వాళ్లు ఎవరో ఏదో చేస్తున్నారని ..మీరు చెయ్యాల్సి వస్తుంది. ఆ ఖర్చులు తగ్గుతాయి. మొహమాటం అక్కర్లేదు.


* ఒంటరిగా ప్రయాణాలు చేసినపుడు మీలోని సామర్థ్యం మీకు అర్థమవుతుంది. నలుగురితో ఎలా మాట్లాడుతున్నారో, కొత్త వాళ్ళతో ఎలా డీల్ చేస్తున్నారో అర్థమవుతుంది. మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటున్నారో మీకే తెలుస్తుంది. 


* ఒంటరిగా ఒక పరిస్థితిని ఎదుర్కున్నపుడే ...మీకు జీవితం మరింత కొత్తగా తెలుస్తుంది. కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు అక్కడి సంస్కృతి, భాషలను గమనించవచ్చు. ఆసక్తిగా ఉంటే భాష నేర్చుకునే అవకాశం ఉంటుంది. నలుగురితో కలిసి వెళ్ళినపుడు అక్కడి వారి సంస్కృతి, భాషలను తెలుసుకునే అవకాశం ఉండదు. కాస్త ధైర్యం చెయ్యండి. మీకే తెలుస్తుంది ఎంత ప్రశాతంగా ఉంటుందో .

newsline-whatsapp-channel
Tags : newslinetelugu good-life india

Related Articles