కొబ్బరి నీళ్లు ఆరోగ్యకరమే.. కానీ అందరికీ కాదు. కొంతమంది కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండాలి. వాళ్ళు ఎవరో తెలుసుకుందాం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: చాలా మంది కొబ్బరినీళ్లు చాలా మంచిది అనే అనుకుంటారు. కాని నిజానికి కొన్ని రకాల ఆరోగ్యసమస్యలతో ఇబ్బంది పడేవారు కొబ్బరినీళలు తాగకూడదు. కొబ్బరి నీళ్లు ఆరోగ్యకరమే.. కానీ అందరికీ కాదు. కొంతమంది కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండాలి. వాళ్ళు ఎవరో తెలుసుకుందాం.
*కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల కిడ్నీ సమస్యలున్నవాళ్లు కొబ్బరి నీళ్ళకు దూరంగా ఉండటం మంచిది. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి పొటాషియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ పెట్టకూడదు. అందులో ఈ కొబ్బరినీళ్లు ఒకటి.
* డయాబెటిక్స్ ...షుగర్ ఉన్నవాళ్లు కూడా కొబ్బరి నీళ్లకు నో చెప్పడమే మంచిది. చక్కెర ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ తో బాధపడేవారు దీనికి దూరంగా ఉండటమే ఉత్తమం.
* కొబ్బరి నీళ్లు తాగితే కడుపులో కొందరికి అసౌకర్యంగా అనిపించే అవకాశం ఉంది. ఎసిడిటీ సమస్య ఉన్నవారికి ...ఫుడ్ సరిగ్గా అరగని వాళ్లకి కొబ్బరినీళ్లు అన్ని సార్లు కాదు కొన్ని సార్లు ఇబ్బందిపెడుతుంది.కొబ్బరినీళ్ళలో ఫైబర్ ఇంకా చక్కెర ఎక్కువగా ఉండటమే. కొంతమందికి కొబ్బరినీళ్లలో డయారేయా కూడా వస్తుంది.
* శరీర బరువును కంట్రోల్లో ఉంచాలనుకునే వాళ్ళు కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండాలి. ముందే చెప్పినట్టు ఇందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇన్సులిన్ లెవల్స్ పెంచడంలో కొబ్బరినీళ్లు చాలా ఫాస్ట్ గా ఉంటాయి. సో కొబ్బరినీళ్లు తాగకపోవడమే మంచిది.