జీవితంలో జాబ్ టెన్షన్స్ , పర్సనల్ లైఫ్ టెన్షన్స్ రెండు ఉంటే అసలు మ్యానేజ్ చెయ్యలేం , కాని సరిగ్గా ప్లాన్ చేస్తే ట్రై చెయ్యొచ్చు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: జాబ్ , పర్సనల్ లైఫ్ రెండు మ్యానేజ్ చెయ్యడం మాట్లాడినంత ఈజీ జాబ్ కాదు. నిజానికి చాలా మందికి ఇది బ్యాలెన్స్ చెయ్యలేకే ..మానసిక సమస్యలు వస్తుంటాయి. జీవితంలో జాబ్ టెన్షన్స్ , పర్సనల్ లైఫ్ టెన్షన్స్ రెండు ఉంటే అసలు మ్యానేజ్ చెయ్యలేం , కాని సరిగ్గా ప్లాన్ చేస్తే ట్రై చెయ్యొచ్చు
* పనిచేస్తున్నప్పుడు ఇంటి విషయాలు ఆలోచించకూడదు, ఇతరులతో చర్చించకూడదు. మీ పని ఆఫీస్ లో అయిపోవాలి. ఇంట్లో కూడా ఇదే చేస్తే మీకు ఇంకా టెన్షన్ ఎక్కువవుతుంది.
* నిజానికి ఇప్పుడున్న వారిలో ఇదే మెయిన్ ప్రాబ్లమ్ . ఫాస్ట్ గా నో చెప్పలేం . కాని నో చెప్పండి. మీకు చాలా హ్యాపీ గా ఉంటుంది. పని తగ్గుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ పనికి సంబంధించి ఏదైనా కాల్ వస్తే నేను చేయలేను అని చెప్పే కెపాసిటీ మీకు ఉండాలి.
* కొన్నిసార్లు మీ కోసం మీరు సెలవులు పెట్టుకొండి. దీనివల్ల మూడ్ రిఫ్రెష్ అవుతుంది. కొత్తగా శరీరంలోకి శక్తి వస్తుంది. దీనివల్ల పనిచేసే సామర్థ్యం ఇంకా పెరుగుతుంది.
* పని వేళల్లో సోషల్ మీడియాకు దగ్గరై పనికి దూరం కావద్దు. నిద్రకు దూరం గా ఉంటూ సోషల మీడియా లో చక్కర్లు కొట్టండి.
* చాలా సేపు కూర్చొని పనిచెయ్యడం అసలు మంచిది కాదు. సో ప్రతి గంటకు ఓ పదినిమిషాలు లేచి అటు ఇటు నడుస్తూ ఆఫీస్ లో అన్ని అబ్జర్వ్ చెయ్యండి. ఇది మీ ఎదుగుదలకు సాయపడొచ్చు.