PREGNENCY: చిన్న వయసులో ప్రెగ్నెన్సీ వస్తే...ఇబ్బందులు ఇవే!

( TEEANAGE) గర్భం, ప్రసవ సమయంలో మరణాలు రక్తస్రావం, అధిక రక్తపోటు రుగ్మతలు లేదా సెప్సిస్ వంటి వాటివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారట.

PREGNENCY: చిన్న వయసులో ప్రెగ్నెన్సీ వస్తే...ఇబ్బందులు ఇవే!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు దాదాపు ఆడపిల్లలంతా బాగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటున్నారు. కాని ఈ తీరంతా ..కేవలం సిటీల్లో మాత్రమే ఊర్లల్లో ఇంకా 18 యేళ్లకే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. యుక్త వయసులోనే తెలీసీ తెలీకుండానే ప్రెగ్నెన్సీ( PREGNENCY) పిల్లలు ..ఇళ్లు , సంసారం బాధలు..బాధ్యతలతో చిన్న వయసులోనే అల్లాడిపోతున్నారు చాలా మంది ఆడపిల్లలు.

తాజాగా జరిగిన ఓ అధ్యయనం ప్రకారం యుక్తవయస్సులో గర్భం ధరించిన యువతలు అకాల మరణాలకు దారితీస్తున్నాయని తెలిపింది. టీనేజ్( TEEANAGE) గర్భం, ప్రసవ సమయంలో మరణాలు రక్తస్రావం, అధిక రక్తపోటు రుగ్మతలు లేదా సెప్సిస్ వంటి వాటివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారట.

కెనడాలోని 2.2 మిలియన్ల మహిళా టీనేజర్లలో 31 సంవత్సరాల వయస్సులోపు ఉన్నవారిపై యూనివర్సల్ హెల్త్‌కేర్ సిస్టమ్‌లో( HEALTH CARE SYSTEM) స్టడీ చేశారు. టీనేజ్ సమయంలో ఒక గర్భం ఉన్నవారిలో 1.5 రెట్లు అకాల మరణం సంభవించే ప్రమాదం ఉండగా.. రెండు లేదా అంతకంటే ఎక్కువ టీనేజ్ గర్భాలు ఉన్నవారిలో 2.1 రెట్లు అకాల మరణాలు ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. యుక్త వయసు అంటే దాదాపు 16 యేళ్ల నుంచి ఇంకా తక్కువ వయసులో పెళ్లి చేసుకుంటే ఎక్కువ శాతం అకాలమరణాలు జరుగుతున్నాయంటున్నారు.

దాదాపు రాజస్థాన్ , బీహార్, ఛత్తీస్ ఘడ్ లో ఇప్పటికి ఈ ఛైల్డ్ మ్యారేజెస్( CHAILD MARRIAGE) జరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. యూనైటెడ్ స్టేట్స్​లో యుక్తవయసులోని బాలికలలో మరణానికి యాక్సిడెంట్లు, ఆత్మహత్య, హత్యలు ఉంటున్నాయని తెలిపింది. 20 నుంచి 44 సంవత్సరాల వయస్సు గల వారు క్యాన్సర్, సూసైడ్​తో ఎక్కువ గా చనిపోతున్నారని తెలిపింది. యుక్తవయసులో చనిపోయే కారణాల్లో ఇదే టాప్​లో ఉన్నట్లు JAMA చేసిన అధ్యయనంలో తేలింది.

ప్రెగ్నెన్సీ టైంలో జరిగే హోర్మోనల్ ఛేంజెస్ , డిప్రెషన్, కంగారు ఇవన్నీ యుక్త వయసుపిల్లలు హ్యాండిల్ చెయ్యలేరు. దీని కారణంగానే..టీనేజర్స్ సూసైడ్ చేసుకుంటు ఉంటున్నారు. అలా కాకుంటే దాదాపు కేసుల్లో సర్వేకల్ క్యాన్సర్లు, నార్మల్ క్యాన్సర్లు, హార్ట్ అటాక్స్ , అనీమియా వంటి ఇబ్బందులతో చనిపోతున్నారు.

Tags:
Next Story
Share it