Harish rao: కాంగ్రెస్ అంటేనే ఓ పెద్ద ధోకా పార్టీ

 కానీ రూ.7లక్షల కోట్లు అప్పు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు స్పష్టం చేశారు. 
 


Published Jul 27, 2024 02:09:56 AM
postImages/2024-07-27/1722064138_modi79.jpg

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ అంటేనే ఓ పెద్ద ధోకా పార్టీ అని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం అసెంబ్లీలో జరిగిన బడ్జెట్‌పై చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. గత 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో తెచ్చిన అప్పు ఎంత? అనే ప్రశ్నకు ఆయన పూర్తి ఆధారాలు, లెక్కలతో సహా లెక్క చెప్పారు.  

సభను, రాష్ట్ర ప్రజలను తప్పదోవ పట్టించేలా హరీష్ రావు మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. భట్టి వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.4 లక్షల 26 వేల 299 కోట్లు మాత్రమే అప్పు ఉందని ఆయన వెల్లడించారు. కానీ రూ.7లక్షల కోట్లు అప్పు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు స్పష్టం చేశారు. 

డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ధోకా ఇచ్చిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. గడిచిన 8 నెలల్లోనే ఎన్నో ధోకాలు జరిగాయని అన్నారు. ప్రతి మహిళలకు నెలకు రూ.2500 రైతు భరోసా కింద రైతన్నకు, కౌలు రైతుకు రూ.15 వేలు, డిసెంబర్ 9న రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ, అన్ని పంటలకు మద్దతు ధరపై రూ.500 బొనస్, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, మొదటి ఏడాదిలోనే రూ.2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.25 వేల పోస్టులలో మెగా డిఎస్సీ, వంద రోజుల్లో రూ.2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు. అవన్నీ పెద్ద ధోకా అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. 

వెంటనే డిఏ, PRC ఇస్తామని ప్రభుత్వ, ఉద్యోగులు ఉపాధ్యాయులకు అబద్దపు హామీలు ఇచ్చారని, ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనం, మైనార్టీలకు ప్రత్యేక సబ్ ప్లాన్, వృద్దులకు రూ.4వేల ఫించన్, దివ్యాంగులకు రూ.6వేల పింఛన్, కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం, ఆటో డ్రైవర్లకు రూ.12 వేల ఆర్థిక సాయం మాత్రమే కాకుండా ప్రతి రోజూ సీఎం ప్రజాదర్బార్ అంటూ అంతా ధోకా అనే అని హరీష్ రావు మండిపడ్డారు. 

newsline-whatsapp-channel
Tags : telangana tspolitics telangana-government assembly-budget-session telanganaassembly budjet telanganabudget harishraobudget

Related Articles