Jagadish reddy: నీళ్లు ఇచ్చే ఉద్దేశ్యం సర్కార్‌కు లేదు

క్రిష్ణా, గోదావరి నదులు ఆంధ్రా కోసమే పుట్టినట్లు పాలకులు వ్యవహరించారని అన్నారు. నీళ్లు ఎలా లిఫ్ట్ చేయాలో తెలిసి మాజీ సీఎం కేసీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్‌ను నిర్మించారని జగదీష్ రెడ్డి అన్నారు.  


Published Jul 27, 2024 01:34:28 AM
postImages/2024-07-27/1722060204_Untitleddesign43.jpg

న్యూస్ లైన్ డెస్క్: రైతులకు నీళ్లు ఇచ్చే ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి, సూర్యాపేట BRS ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఒక్క మంత్రికి వ్యవసాయంపై అవగాహన లేదని ఆయన ఎద్దేవా చేశారు. 

క్రిష్ణా, గోదావరి నదులు ఆంధ్రా కోసమే పుట్టినట్లు పాలకులు వ్యవహరించారని అన్నారు. నీళ్లు ఎలా లిఫ్ట్ చేయాలో తెలిసి మాజీ సీఎం కేసీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్‌ను నిర్మించారని జగదీష్ రెడ్డి అన్నారు. విహార యాత్రలు చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటేనని విమర్శించారు. నేడు రామగుండం దగ్గర గోదావరి ఎలా ఉందని ప్రశ్నించారు. 

మేడిగడ్డకు ఏదో జరిగిందని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, సింగూరు ప్రాజెక్టులు నీళ్లు లేక ఎండిపోతున్నాయని తెలిపారు. కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో రైతులు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇప్పటికే మేడిగడ్డ దగ్గర 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయని వెల్లడించారు.

ఓవైపు రైతులు పంటలకు నీళ్లు అందక ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వానికి నీళ్లు ఇవ్వాలనే ఆలోచన కూడా లేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరంపై  తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు నాటకాలు ఆడారని జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఎన్డీఎస్‌ఏ హైదరాబాద్ రాకుండా ఢిల్లీ నుంచే కిషన్ రెడ్డి చెప్పినట్లు రిపోర్ట్ ఇచ్చిందని ఆయన ఆరోపించారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news telanganam congress-government telangana-government jagadish-reddy government

Related Articles