Samantha : ఆ హీరోతో రొమా*న్స్ చేసేందుకు సిద్ధపడ్డ సమంతా

హెల్త్ సమస్యలతో కొన్ని నెలలుగా యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చిన సమంతా త్వరలో మళ్లీ కెరీర్ ట్రాక్ లోకి తెచ్చే పనిలో బిజీగా ఉంది.


Published Jul 27, 2024 03:24:06 AM
postImages/2024-07-27/1722064655_samantha.jpg

న్యూస్ లైన్ డెస్క్ : హెల్త్ సమస్యలతో కొన్ని నెలలుగా యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చిన సమంతా త్వరలో మళ్లీ కెరీర్ ట్రాక్ లోకి తెచ్చే పనిలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే నెట్ ఫ్లిక్స్ లో ఓ వెబ్ సిరీస్ కి సైన్ చేసేసింది. రక్త్ బ్రహ్మాండ్ అనే టైటిల్ తో రానున్న  ఈ వెబ్ సిరీస్ ఫాంటసీ థ్రిల్లర్ తో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందట. అయితే ఈ విషయంలో ఇప్పుడు కీలక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

మీర్జాపూర్ సిరీస్ తో ఫేమస్ అయిన అలీ ఫజల్ తో ఈ సిరీస్ లో సమంతా జత కట్టనుంది. హిందీ సినీ పరిశ్రమలో ఫేమస్ అయిన నటులలో అలీ ఫజల్ కి మంచి పేరుంది. ఇటు సమంతా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరితో పాటు ఈ సిరీస్ లో ఆదిత్యరాయ్ కపూర్, వామికా గబ్బి కూడా ఈ సిరీస్ లో నటిస్తున్నారు.

ఇంతకీ ఈ వెబ్ సిరీస్ కి ఎవరు దర్శకులో చెప్పలేదు కదా. తుంబాద్ ఫేమ్ అయిన రాహి అనిల్ భర్వే దర్శకత్వంలో రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఇప్పటికే సమంతా నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కి నిర్మించిన రాజ్, డీకే బ్యాంక్ రోల్ వారే రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ కూడా నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

 

newsline-whatsapp-channel
Tags : tollywood movie-news bollywood- samantha latest-news telugu-news samantha-movie-re-release

Related Articles