AMBANI: అనంత్ , రాధిక పెళ్లికి సెలబ్రెటీస్ కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవే ?

అనంత్ అంబానీనే తన పెళ్లికి తన ఫ్రెండ్స్ అందరికి దాదాపు 2 కోట్ల రూపాయిలు  వాచ్ లు గిఫ్ట్ ఇచ్చారు.అత్యంత ఖరీదైన ఈ వివాహానికి ప్రపంచంలోనే ప్రముఖులంతా హాజరయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్  సెలబ్రెటీలంతా వెళ్లి సందడి చేశారు. 


Published Jul 22, 2024 07:27:00 PM
postImages/2024-07-22/1721656698_AMBANI202407df0571eb70a4addfb0c64d113dc123653x2.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పెళ్లికి గిఫ్ట్స్ లేకపోతే ఎలా చెప్పండి. అసలు పెళ్లంతా అయిపోయిన తర్వాత అసలు ఏం గిఫ్ట్స్ వచ్చాయనేది ప్రతి కపుల్ చేసే పనే..అదో  ఆనందం.  అయితే నార్మల్ పీపుల్ మనమే ఇలా ఆలోచిస్తే ....అసలు గిఫ్ట్స్ ఇచ్చే వాళ్లు ఎలా ఫీలవుతారు. ఎంత ఆలోచించి ఉంటారు. అనంత్ అంబానీనే తన పెళ్లికి తన ఫ్రెండ్స్ అందరికి దాదాపు 2 కోట్ల రూపాయిలు  వాచ్ లు గిఫ్ట్ ఇచ్చారు.అత్యంత ఖరీదైన ఈ వివాహానికి ప్రపంచంలోనే ప్రముఖులంతా హాజరయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్  సెలబ్రెటీలంతా వెళ్లి సందడి చేశారు. 


* అందరికంటే ఖరీదైన బహుమతి.. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్  ఇచ్చారు. ఆయన అనంత్- రాధిక మర్చంట్ జంటకు దాదాపు రూ.300కోట్ల విలువ చేసే ప్రైవేట్ జెట్ ని బహుమతిగా ఇచ్చారట. 


* ఈ నూనత వధూవరులకు ముకేష్-నీతా జంట కూడా ఓ బహుమతిని ఇచ్చారట. పామ్ జుమేరాలో దాదాపు 3వేల చదరపు అడుగుల ఇంటిని బహుమతిగా ఇచ్చారట. దీని విలవ దాదాపు రూ.60కోట్లు . దీనికి తోడు రూ.130కోట్ల విలువచేసే నగలు, రూ.5.42 కోట్ల విలువ చేసే బెంట్లీ కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చారట.


* ఇక బాలీవుడ్ బాద్ షా  షారుక్ ఖాన్ పారిస్‌లో రూ.40 కోట్ల ఇంటిని బహుమతిగా ఇచ్చాడు. 


*అమితాబ్ బచ్చన్ 30 కోట్ల రూపాయల విలువైన నెక్‌పీస్‌ను బహుమతిగా ఇచ్చారు.


* రణవీర్ సింగ్, దీపికా పదుకొణె 20 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కారును బహుమతిగా ఇచ్చారు.


* వ్యాపారవేత్త బిల్ గేట్స్ రూ.9 కోట్ల విలువైన వజ్రాన్నిఈ జంటకు  బహుమతిగా ఇచ్చారు.  


* రస్ట్లర్ జాన్ సెనా రూ.3 కోట్ల విలువైన లాంబోర్గినీ కారును బహుమతిగా ఇచ్చారట.


* అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ రూ.11.50 కోట్ల విలువైన బుగాటీ కారును బహుమతిగా ఇచ్చారట.


* సల్మాన్ ఖాన్ 15 కోట్ల రూపాయల విలువైన స్పోర్ట్స్ బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు. 


* రణబీర్ కపూర్, అలియా భట్ లు రూ.9 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు. 


*నటుడు అక్షయ్ కుమార్ రూ.60 లక్షల విలువైన బంగారు పెన్నును బహుమతిగా ఇచ్చారు. 


* విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ 19 లక్షల రూపాయల విలువైన బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు. 


*సిద్ధార్థ్ మల్హోత్రా , కియారా అద్వానీ 25 లక్షల రూపాయల విలువైన హ్యాండ్‌మేడ్ శాలువను బహుమతిగా ఇచ్చారు. ఇంకా చిన్న చిన్న బంగారు గొలుసులు...వాచ్ లు ...బ్లేజర్లు...కార్లు...ఉంగరాలు ..బ్రేస్లెట్స్ అన్నీ కలిపి దాదాపు నాలుగు కేజీల బంగారం వచ్చిందని బాలీవుడ్ మీడియా కథనాలు...అసలు గిఫ్ట్స్ ఏంటో  చూడాలి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu wedding ananth-ambani

Related Articles