Amarnath Yatra: ఈనెల 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర..సెక్యూరిటీ పెంచిన ప్రభుత్వం

మరో వారం రోజుల్లో అమర్‌నాథ్( AMARNATH)  యాత్ర ప్రారంభం కానుంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో( JAMMU KASHMIR) వరుస ఉగ్రవాద ఘటనలు దృష్ట్యా ప్రభుత్వం మరింత సెక్యూరిటీ ని పెంచింది. ఈ నెల 29 వ తేదీన అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ప్రథమ పూజలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొంటారు. అమర్‌నాథ్ యాత్రికులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.


Published Jun 23, 2024 01:42:57 PM
postImages/2024-06-23/1719130377_amarnathyatra.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మరో వారం రోజుల్లో అమర్‌నాథ్( AMARNATH)  యాత్ర ప్రారంభం కానుంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో( JAMMU KASHMIR) వరుస ఉగ్రవాద ఘటనలు దృష్ట్యా ప్రభుత్వం మరింత సెక్యూరిటీ ని పెంచింది. ఈ నెల 29 వ తేదీన అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ప్రథమ పూజలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొంటారు. అమర్‌నాథ్ యాత్రికులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.


గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లో వరుసగా ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి. అమర్‌నాథ్ యాత్రికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే అధికారులు మాత్రం పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేసి.. అమర్‌నాథ్ మంచు లింగాన్ని ( MANCHU LINGAM) దర్శించుకునే భక్తుల కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. రిజిస్టేషన్లు కూడా మొదలవుతున్నాయని తెలిపారు.


దేశవ్యాప్తంగా యాత్రికులకు అమర్‌నాథ్ మంచు లింగం భక్తులకు కనువిందు చేయనుందని చెప్పారు. దేవస్థానం బోర్డు, జమ్మూ కాశ్మీర్ ( JAMMU KASHMIR) పాలనా యంత్రాంగం యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. గత రెండేళ్లుగా అమర్‌నాథ్ యాత్రకు సౌకర్యాలు చాలా మెరుగయ్యాయని చెప్పారు. ఆలయ గుహకు వెళ్లే రహదారులకు మరమ్మతులు నిర్వహించి.. సౌకర్యవంతంగా చేసినట్లు వెల్లడించారు. యాత్రికులు ఎలాంటి అనుమానం లేకుండా స్వామి వారి దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : jammu-kashmir amarnath-yatra june-29th

Related Articles