MUKESH AMBANI: సామూహిక వివాహాలు జరిపిస్తున్న ముకేశ్ అంబానీ

Published 2024-07-03 12:03:41

postImages/2024-07-03/1719988421_InsideTheAmbaniFamilysSpectacularMassWeddingForOver50CouplesSeeThePhotos.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  అనంత్ అంబానీ ( ANANTH AMBANI) పెళ్లి సందర్భంగా ఎన్నో మంచి పనులు చేస్తున్నారు ముకేఖ్ అంబానీ ( MUKESH AMBANI)  దంపతులు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. జులై 12న గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు మూడు రోజుల పాటు అనంత్, రాధికల వివాహ వేడుకలు జరిపించాలని ప్లాన్ చేస్తున్నారు. కుమారుడి వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలని సామూహిక వివాహాలు జరిపించారు.


నవీ ముంబైలో ( MUMBAI) మంగళవారం నాడు (జులై 2న) పేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు అంబానీ దంపతులు. ఆ జంటల్ని ప్రత్యేకంగా పలకరించి వారికి అభినందనలు తెలిపారు. ఆ పెళ్లి జంటలకు బంగారం, వెండి ఆభరణాలను గిఫ్ట్ ఇచ్చారు. 


అయితే దాదాపు జూలై 10 వ తారీఖు నుంచి అనంత్ అంబానీ ఇంట పెళ్లి హడావిడి మొదలయిపోతుంది. సోషల్ మీడియా లో అప్పుడే అంబానీ ఇంట పెళ్లి డెకరేషన్, వంట , భోజనాలు, రిటర్న గిఫ్ట్స్, డిజైనర్ బట్టలు, సెలబ్రెటీలు ఎవరెవరు వస్తారు...అంటూ తెగ హైరానా పడిపోతుంటారు మీడియా మిత్రులు. ఈ పెళ్లి బాలీవుడ్ పెళ్లే. సో ప్రతి విషయం ప్రత్యేకమే.