Atal Sethu:  అటల్ సేతు వంతెనకు పగుళ్లు 2024-06-21 21:55:16

న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అటల్ సేతు బ్రిడ్జిని 17,840 కోట్లతో నిర్మించారు. ముంబైలో 5 నెలల కింద ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదగా ప్రారంభమైంది. దేశంలో నదిపై కట్టిన అతి పెద్ద బ్రిడ్జిగా ఇది రికార్డు సృష్ట్రించింది. ఇదిలా ఉండగా, 5నెలలు తిరగక ముందే వంతెనకు చిన్నపాటి వర్షానికే పగుళ్లు రావటం వివాదాస్పదం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ బ్రిడ్జిపై ఇంత తక్కువ సమయంలోనే పగుళ్లు రావటంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసింది. ప్రస్తుతం బ్రిడ్జిపై రెండు నుండి మూడు అడుగుల మేర పగుళ్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.