దాదాపు 25 రంగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నాయి. పురోహితుల నుంచి ఈవెంట్ ఆర్గనైజర్ల వరకు అందరూ బిజీగా మారిపోనున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: పుష్యమాసం నిన్నటితో ముగిసింది. మౌని అమావాస్య తో పుష్యమాసం పోయి ఈ రోజుతో మాఘమాసం స్టార్ట్ అయ్యింది, రేపటి నుంచి వరుసపెట్టి ముహూర్తాలు ఉండడంతో పెళ్లి సందడితో కళ్యాణ మండపాలు కళకళలాడనున్నాయి. ఇన్ని రోజుల పాటు శుభకార్యాలకు దూరంగా ఉన్న ఇళ్లలో సందడి మొదలయ్యింది. ఇక్కడి నుంచి చాలా రంగాలు యాక్టివ్ అయ్యాయి. దాదాపు 25 రంగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నాయి. పురోహితుల నుంచి ఈవెంట్ ఆర్గనైజర్ల వరకు అందరూ బిజీగా మారిపోనున్నారు.
బుక్ అయిన కళ్యాణ మండపాల్లో పనులు మొదలు కానున్నాయి. రేపటి నుంచి మొదలయ్యే ముహూర్తాలు నాలుగు నెలల పాటు అంటే మే 23 వరకు ఉన్నాయి. అదే నెల 28 న జేష్ఠమాసం మొదలుకానుంది. అయితే మధ్యలో ఫాల్గుణమాసంలో మార్చి 18 నుంచి 28 వరకు శుక్రమౌఢ్యమి కారణంగా ముహూర్తాలు లేవు. ఈ సారి మాఘమాసంలో తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో జంటలు ఒక్కటి కానున్నట్లు ఇప్పటకే బుక్ అయిన కళ్యాణమండల బుకింగ్ డీటైల్స్ చెబుతున్నాయి.