గురువారం ఈ తాఖీదు ఇచ్చినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : వినియోగదారుల మొబైల్ ఫోన్ ఓఎస్ ఆధారంగా ఒకే రైడ్ కు వేరే వేరే ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలపై కేంద్రప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గురువారం ఈ తాఖీదు ఇచ్చినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
మొబైల్ ఫోన్ ఓ ఎస్ ఆధారంగా ఒకే రకమైన రైడ్ కు వేర్వేరు ఛార్జీలు వసూలు చెయ్యడం ఇప్పుడు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతుంది. ఓలా , ఉబర్ కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. అసలు వెళ్లే దారులు ఒకటే అయినపుడు రేట్లు ఈ తేడా ఎందుకు అని ప్రశ్నించింది.
వినియోగదారలు ఉపయోగిస్తున్న ఫోన్స్ మోడళ్ల ఆధారంగా ప్రయాణ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు గమించాం. ఐఫోన్ ఛార్జీలు ఒకలా ...ఆండ్రాయిడ్ ఒకలా ...ఛార్జీలు వస్తున్నాయని సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రధాన క్యాబ్ అగ్రిగేటర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేశాం. ఓలా, ఉబర్ నుంచి ప్రతిస్పందలను కోరుతున్నాం' అని ప్రహ్లాద్ జోషి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఒక రైడ్ కోసం ఒకేసారి ఆండ్రాయిడ్, ఐఫోన్లో బుక్ చేస్తే వేర్వేరు ఛార్జీలు చూపిస్తున్నట్లు ఫొటోలు పేడుతున్నారు.