ఇంకా చాలా మంది బస్సు ఎక్కగానే...మొదట వాంతులు చేసుకుంటూ తల కిటీకి లోంచి బయటకు పెట్టడం చాలా మందికి అలవాటు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బస్సులు , వాహనాల్లో ప్రయాణించేటపుడు కిటికీలోంచి గాలిపీలుస్తూ చాలా మంది గాలిని ఆశ్వాదిస్తూ ఉంటారు. మరికొందరు ఫొటో పిచ్చితో ...ఇంకా చాలా మంది బస్సు ఎక్కగానే...మొదట వాంతులు చేసుకుంటూ తల కిటీకి లోంచి బయటకు పెట్టడం చాలా మందికి అలవాటు.
కర్నాటకలోని మైసూరులో దారున ఘటన చోటు చేసుకుంది. ఓ వాహనం కిటికీలో తల బయటకు పెట్టి వాంతు చేసుకునేందుకు ప్రయత్నించిన మహిళ తల తెగి రోడ్డుపై పడిపోయింది. ఆర్టీసీ బస్సు లో నుంచి తల బయటకు పెట్టి వాంతులు చేసుకుంటున్న ఓ మహిళ తల తెగి పడింది. మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకా సింధువళ్లి గ్రామం వద్ద శనివారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
బేగూరు సమీపంలోని ఆలహళ్లి గ్రామ నివాసి శివలింగమ్మ (58) అనే మహిళ కర్ణాటక ఆర్టీసీ బస్సులో కుడివైపు కూర్చుని ఉంది. ఆమె బస్సులో వాంతి చేసుకోబోతూ తల బయటకుపెట్టింది. దీంతో తల బయటకు పెట్టడంతో పక్కనుంచి వెళ్తున్న లారీ ఢీకొట్టి కుడి చెయ్యి ..తల అక్కడే తెగి నెల మీద పడ్డాయి.ఈ ప్రమాదంలో మరో ప్రయాణికురాలి కుడిచేతి కూడా ఫ్రాక్చర్ అయింది. బంధువు నిశ్చితార్థం అనంతరం బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన శివలింగమ్మ ఈ ప్రమాదం జరిగింది.