బాధితురాలి కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం చెల్లించాలని బంగాల్ ప్రభుత్వానికి ఆదేశించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కోలకత్తా ఆర్ జీ డాక్టర్ హత్యాచార కేసులో దోషి సంజయ్ రాయ్ కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద శిక్షను ఖరారు చేసింది సీల్దా కోర్టు. భారతీయ న్యాయసంహితలోని 64, 66, 103/1 సెక్షన్ల కింద శనివారం దోషిగా తేల్చిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ సోమవారం మధ్యాహ్నం ఈమేరకు తీర్పు ఇచ్చారు. రూ.50 వేల జరిమానా కూడా విధించారు. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం చెల్లించాలని బంగాల్ ప్రభుత్వానికి ఆదేశించారు.
కట్టుదిట్టమైన భద్రత మధ్య దోషి సంజయ్ రాయ్ ను సీల్దా కోర్టుకు తరలించారు. 500 మంది పోలీసులతో సంజయ్ ను కోర్టుకు తరలించారు. అంతేకాదు శిక్ష ఖరారు చేయడానికి ముందు తన వాదనను వినిపించుకోవడానికి జడ్జి అతడికి అవకాశం కల్పించారు. అయితే మరింత విచారణ జరపండి..నన్ను ఇరికించారని వాపోయాడట. అయితే తనతో బలవంతంగా కాగితాలపై సంతకాలు చేయించారని తాను అమాయకుడినని వాదించాడు. ఈ కేసులో చాలా ఆదారాలు ధ్వంసం అయ్యాయని తెలిపాడట.
మరోవైపు సీబీఐ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఇది చాలా అరుదైన కేసని, ఈ ఘటన పౌర సమాజాన్ని ఎంతగానో కలచి వేసిందని గుర్తు చేశారు. దోషి సంజయ్‌రాయ్‌కు ఉరిశిక్ష విధించాలని కోరారు. కాని కోర్టు ఇదేం రేర్ కేసు కాదని ...జీవిత ఖైదు చాలని తెలిపిందట వైద్యులకే రక్షణ లేకపోతే ఇంకేం చేయాలని, మరణశిక్ష మాత్రమే సమాజంలో విశ్వాసాన్ని పునరుద్ధరించగలదని వాదించారు. ఇరు పక్షాల వాదనలు జడ్జి ఇది అరుదైన కేసు కాదని పేర్కొంటూ, చివరకు జీవిత ఖైదు విధించారు.
జూనియర్ డాక్టర్ తల్లితండ్రులు మాత్రం కోర్టు చెప్పినట్లు 17 లక్షలు తమకు వద్దని ..తమకు న్యాయం కావాలని ...తమ కూతురు కావాలని లేదంటే తప్పు చేసినవాడికి ఉరి శిక్ష వెయ్యాలని కోరారు.