హార్రర్ సినిమాలకు మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఈ హార్రర్ జోన్ లో రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఓటీటీ లో ప్రతి వారం చాలా జోనర్స్ లో సినిమాలు , వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతుంటాయి. అయితే హార్రర్ సినిమాలకు మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఈ హార్రర్ జోన్ లో రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఒకరోజు ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చాయి. పైగా అవి కూడా తెలుగు సినిమాలే.
‘డెడ్‌లైన్’ మూవీ ఫస్ట్ లైన్ లో ఉంది. ఈ మూవీని బొమ్మారెడ్డి VRR రచన దర్శకత్వం వహించారు. అజయ్ ఘోష్ , అపర్ణమాలిక్ ప్రధాన పాత్రలు పోషించారు. 2023 ఫిబ్రవరి 24న థియేటర్ లో విడుదలైంది. సినిమా కాన్సప్ట్ చాలా బాగుంది కాని ప్రొడక్షన్ వాల్యూస్ బాలేవు. దీని వల్లే సినిమా నాసిరకంలా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే రిలీజైన ఏడాది తర్వాత డెడ్‌లైన్ ఎయిర్‌టెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ట్రీమ్‌ప్లేలో స్ట్రీమింగ్ లో ఉంది.
ఒకరోజు లాంగ్ డ్రైవ్ కోసం వెళ్తారు. ఇక ఆ సమయంలో దారిలో మోనీ అనే అమ్మాయి వీరిని లిఫ్ట్ అడుగుతంది. దీంతో వీరు ఆ ఆమ్మాయికి లిఫ్ట్ ఇస్తారు. కానీ, మోనీ ఓ సీరియల్ కిల్లర్. జాలీ, రాబర్ట్‌లను చంపేస్తుంది. దీంతో ఈ మర్డర్‌కేసును ఎస్ఐ ముఖేష్ ఎలా సాల్వ్ చేశాడు? మోనీ సీరియల్ కిల్లర్‌గా మారడానికి కారణమేమిటి? అసలు జాలీ, రాబర్ట్ నిజంగా భార్యాభర్తలేనా? వారి గురించి ముఖేష్ తెలుసుకున్న షాకింగ్ నిజం ఏమిటన్నదే పాయింట్‌తో డెడ్‌లైన్ మూవీ సాగుతుంది.
‘మహిషాసురుడు’..ఇది కూడా ఒక మర్డర్ మిస్టరీ రవికుమార్ దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమా కూడా గతేడాది జనవరిలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంద. ఇక ఈ సినిమా కూడా థియేటర్స్ లో విడుదలైన ఏడాది తర్వాత.. ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ లో ఉంది. అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతున్నాయి.