ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు అక్కడి కుటుంబాలు నిండా 14 ఏళ్లు కూడా నిండని బాలికలకు వివాహాలు జరిపిస్తున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; పొరుగుదేశం పాకిస్థాన్ లో ఆడవారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దేశంలో నడుస్తున్న పరిస్థితులను బట్టి..వర్షాకాలం వధువులు ఎక్కువవుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు అక్కడి కుటుంబాలు నిండా 14 ఏళ్లు కూడా నిండని బాలికలకు వివాహాలు జరిపిస్తున్నారు. ఇప్పుడు పాక్ లో పెళ్లి అంటే ...కడుపునిండా తిండి..కంటినిండా నిద్ర ఇది మాత్రమేనని చెప్తున్నారు.
నిజానికి పాకిస్థాన్‌లో బాల్య వివాహాలు ఎక్కువే అయినా ఇటీవలి కాలంలో అవి తగ్గుముఖం పట్టాయి. అయితే, రెండేళ్ల క్రితం సంభవించిన వరదలతో పాక్ అల్లకల్లోలం అయింది. వాతావరణ పరిస్థితులు పూటగడవని స్థితికి తీసుకొచ్చాయి. దీంతో మళ్లీ బాల్యవివాహాలు ..తన వయసు కంటే రెండింతలు ఎక్కువ వయసు ఉన్న వారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇది కేవలం తిండి , బట్ట కోసం మాత్రమేనంటున్నారు.
2022లో సంభవించిన వరదలు బాల్య వివాహాలకు మరింత ఆజ్యం పోసినట్టు ‘సుజగ్ సంసార్’ అనే ఎన్‌జీవో వ్యవస్థాపకుడు మషూక్ బిర్హ్‌మణి పేర్కొన్నారు. బతికేందుకు ఇక మార్గం లేక ఈ బాల్యవివాహాలు చేస్తున్నారని అన్నారు. 2022 వరదలకు ముందు ఇలాంటి పరిస్థితి లేదన్నారు. షామిలా వివాహం చేసుకున్న ఖాన్ మొహమ్మద్ మల్లా గ్రామంలో గత వానాకాలం నుంచి ఇప్పటి వరకు 45 బాలికలు భార్యలుగా మారారని వివరించారు. అయితే దేవుని దయ వల్ల బాల్యవివాహాలు చేసినా ఆడపిల్లలు ఆనందంగానే ఉన్నారని అంటున్నారు.