ratan tata: భారత్ తన మకుటాన్ని కోల్పోయింది !

బుధవారం రాత్రి 11.30 గంటలకి కన్నుమూశారు. రతన్ టాటా మరణ వార్తను టాటా సన్స్ చైర్మన్ ఎన్ . చంద్రశేఖరన్ స్వయంగా ప్రకటించారు.


Published Oct 10, 2024 07:46:00 AM
postImages/2024-10-10/1728530631_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పారిశ్రామిక దిగ్గజం ...భారత్ వెన్నుముక రతన్ టాటా కన్నుమూశారు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఇక లేరు. ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పటిల్ లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకి కన్నుమూశారు. రతన్ టాటా మరణ వార్తను టాటా సన్స్ చైర్మన్ ఎన్ . చంద్రశేఖరన్ స్వయంగా ప్రకటించారు.


రతన్‌ టాటా మరణవార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణవార్త వినగానే రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. రతన్‌ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


రతన్‌ టాటా మృతికి కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. రతన్ టాటా పేరును ఏ భారతీయుడు మరిచిపోడని ...వ్యాపార దాతృత్వంలో చెరగని ముద్ర వేశారని లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రతన్ టాటా కుటుంబానికి టాటా గ్రూప్ కు ఎక్స్ లో సంతాపం తెలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే విచారం తెలియజేశారు. దేశం తన ముద్దుబిడ్డను కోల్పోయిందని ఆయన అన్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business-man tatamotors

Related Articles