Movie: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్ అప్‌డేట్

మూవీయూనిట్ ఈ సినిమాకు సంబంధించి లాచ్ డేట్‌పై అదిరిపోయే అప్‌డెట్ అందించారు. 


Published Aug 08, 2024 08:42:57 AM
postImages/2024-08-08/1723124541_ntr2.PNG

న్యూస్ లైన్ సినిమా: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా దేవర. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హరోయిన్‌గా నటిస్తోంది. ఇక బాలీవుడ్‍లో హృతిక్ రోషన్‍తో కలిసి ఎన్టీఆర్ వార్-2 మూవీలో కూడా నటిస్తున్నారు. కేజీఎఫ్, సలార్ సినిమాల బ్లాక్‍బస్టర్లతో జోష్ మీద ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారు. మూవీయూనిట్ ఈ సినిమాకు సంబంధించి లాచ్ డేట్‌పై అదిరిపోయే అప్‌డెట్ అందించారు. 

ఈ మూవీని రేపు అధికారికంగా లాంచ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ‘న్యూ బిగినింగ్స్  హైదరాబాద్ పిలుస్తోంది’ అంటూ ప్రశాంత్ భార్య లికిత గురువారం ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో లాంచ్‌పై మరింత ఆత్రుత పెరిగింది. కాగా, మేకర్సే రేపు ఫొటోలు షేర్ చేస్తారని సమాచారం. దీంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : jr-ntr tollywood kgf movie-news devara prashanth-

Related Articles