ఏపీ తెలంగానలో 14 ప్రదేశాలను హై అలర్ట్ జోన్ లుగా ప్రకటించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో యావత్ భారత్ అలర్ట్ అయ్యింది. ఓ వైపు భారత్ ప్రభుత్వం ఉగ్రవాదులను ఎరవేసే దిశగా కీలక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘూ వర్గాలు హెచ్చరించాయి. ఏపీ తెలంగానలో 14 ప్రదేశాలను హై అలర్ట్ జోన్ లుగా ప్రకటించారు.
ఏపీ , తెలంగాణ లో 14 ప్రదేశాలకు హై అలర్ట్ జోన్ లుగా ప్రకటించారు. ఇవి. వెంటనే తదుపరి నోటీసు వచ్చే వరకు అమలులోకి వస్తాయి. మెరుగైన భద్రతా చర్యలను నిర్ధారించడానికి ఈ రాత్రి నాటికి ప్రత్యేక ఆక్టోపస్ బృందాలు ఈ ప్రాంతాల్లో మోహరించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ - హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ తిరుమల, అలిపిరి - తిరుపతి రైల్వేస్టేషన్ - విశాఖపట్నం రామకృష్ణ బీచ్ , రైల్వేస్టేషన్ - విజయవాడ కూకట్ పల్లి - హైదరాబాద్ నాంపల్లి -హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్ - హైదరాబాద్ ట్యాంక్ బండ్ - హైదరాబాద్ జగదాంబ జంక్షన్ -విశాఖపట్నం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ - విజయవాడ ఎం.జి. రోడ్ - విజయవాడ పౌరులు అవసరమైతే తప్ప ఈ ప్రాంతాలను సందర్శించకుండా ఉండాలని సూచించారు. ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్రదేశాల్లో సంచరించకపోవడమే మంచిదంటున్నారు. వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు తెలిపారు.