దివంగత పోప్ కు తుది వీడ్కోలు తెలిపారు. భారత ప్రభుత్వం తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రోమన్ క్యాథలిక్ చర్చి అధినేత పోప్ ఫ్రాన్సిస్ కి కడసారి వీడ్కోలు పలికారు. వాటికన్ లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో శనివారం ప్రపంచ ప్రముఖుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సుమారు 2.5 లక్షల మందికి పైగా విశ్వాసులు, ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల ప్రతినిధులు, దేశాధినేతలు హాజరయ్యారు. దివంగత పోప్ కు తుది వీడ్కోలు తెలిపారు. భారత ప్రభుత్వం తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.
సెయింట్ పీటర్స్ బేసిలికా ప్రాంగణంలో జరిగిన ఈ ప్రత్యేక ప్రార్థనలకు కార్డినల్ జియోవన్నీ బటిస్టా రే నేతృత్వం వహించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది కార్డినల్స్ తో పాటు ఆర్చ్ బిషప్ లు , బిషప్స్ , మతపెద్దలు పాల్గొన్నారు. ఈ టైంలో కార్డినల్ రే మాట్లాడుతూ పోప్ ఫ్రాన్సిస్ ప్రజల మనిషని అందరి పట్ల చాలా దయతో ఉండేవారని తెలిపారు. ప్రపంచంలో యుద్ధాల వల్ల జరుగుతున్న నష్టాన్ని చూసి పోప్ తీవ్రంగా కలత చెందారని, శాంతి స్థాపన కోసం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పిలుపునిచ్చారని ఆయన వివరించారు.వాటికన్ గోడల వెలుపల ఈ బేసిలికాలో ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేశారు. శతాబ్ధ కాలంలో వాటికన్ వెలుపల ఖననం చేయబడిన తొలిపోప్ ఫ్రాన్సిస్ కావడం గమనార్హం .భద్రతా కారణాల దృష్ట్యా రోమ్ నగరం అంతటా 2000 మందికి పైగా పోలీసులను మోహరించారు.