పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణనష్టానికి సంతాపం వ్యక్తం చేస్తూనే.. భారత్ ప్రతిఘటనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: పహల్గాం లో ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. భారత్ తన కోపాన్ని చూపిస్తూనే ఉంది. ప్రజలకు న్యాయం చెయ్యడానికి తన ప్రయత్నం చేస్తూనే ఉంది.అయితే భారత్ చర్యలకు పాకిస్థాన్ కూడా కౌంటర్ విసిరింది. భారత్ తో జరిగిన సిమ్లా ఒప్పందాన్ని విరమించుకుంది, అయితే 1972 లో ఈ సిమ్లా ఒప్పందం జరిగింది. భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని విరమించుకున్నందుకు గాను పాకిస్థాన్ సిమ్లా ఒప్పందాన్ని విరమించుకుంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణనష్టానికి సంతాపం వ్యక్తం చేస్తూనే.. భారత్ ప్రతిఘటనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. వాటిని “ఏకపక్ష, అన్యాయమైన, రాజకీయ ప్రేరేపిత, అత్యంత బాధ్యతారహితమైన, చట్టపరమైన అర్హత లేనివి” అని పేర్కొంది. 1971 యుధ్ధం తర్వాత భారత్ , పాకిస్థాన్ మధ్య సంతకం చేయబడిన శాంతి ఒ్పందం . నిజానికి ఈ ఒప్పందం ముఖ్య ఫలితం కాశ్మీర్ లో నియంత్రణ రేఖ ఏర్పాటు ఇది భారత్ , పాకిస్థాన్ ను విభజించింది. యుధ్ధ ఖైదీల తిరిగి రావడం , దళాలను ఉపసంహరించుకోవడం రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారా భవిష్యత్ వివాదాలను పరిష్కరించుకుంటామని హామీ ఇవ్వడం కూడా ఈ ఒప్పందం లో వివరించబడింది.పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ చేస్తున్న ఆరోపణలపై పాకిస్తాన్ స్పందించింది. భారత్ వేసేవి నిందలే ..తమకు ఈ దాడులకు అస్సలు సంబంధం లేదని తెలిపారు.