పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ లో 500 లకి పైగా పరుగులు చేసి ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ మరీ దారుణంగా తయారయ్యింది. పాక్‌ను నిత్యం ద్వేషించే కొంతమంది భారత క్రికెట్ అభిమానులు కూడా పాక్ ఆట చూసి ఆశ్చర్యపోతున్నారు. మరీ రోజు రోజుకు చీప్ గా తయారవుతుంది. సొంత గడ్డపై పాకిస్థాన్ అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది. క్రికెట్ చరిత్రలోనే అలాంటి ఓటమిని మరే జట్టు కూడా చవిచూడలేదు. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ లో 500 లకి పైగా పరుగులు చేసి ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్ 2021లో బాబర్ ఆజమ్ కెప్టెన్సీలోని పాకిస్థాన్ జట్టు ఫైనల్ ఆడింది. ఆ తర్వాత నుంచి.. అన్ని ఓటములే. ఏ పెద్ద టోర్నీలో కూడా మంచి ప్రదర్శన కనబర్చలేదు. విదేశాల్లోనే కాదు.. స్వదేశంలో కూడా టెస్ట్ సిరీస్‌లో ఓడిపోతూ వస్తోంది. 2021 లో ఇండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ చాలా మంచి ప్రదర్శన కనబరించింది. ఆ మ్యాచ్ లో పాక్ స్టార్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదీ సూపర్ బౌలింగ్ తో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లను వెంటవెంటనే అవుట్ చేశాడు.
రాహుల్, కోహ్లీలను అవుట్ చేసిన ఆనందంలో షాహీన్ అఫ్రిదీ బౌండరీ లైన్ వద్ద వాళ్లు ఏ షాట్ ఆడి అవుట్ అయ్యారో.. ఆ షాట్లను ఇమిటేట్ చేస్తూ.. కాస్త షో ఆఫ్ చేశాడు. ఆ విషయం చాలా ఫేమస్ అయ్యింది. టీ 20 కప్ 2021 లో షాహీన్ ఆఫ్రీది ..హారత్ స్టార్ క్రికెటర్స్ ను వెక్కిరించినప్పటి నుంచి దేవుడు పాక్ ను వెక్కిరిస్తున్నాడు. ఎప్పుడు ఆటలోకి దిగినా పాకిస్థాన్ పతనం మొదలైందని ప్రముఖ అంపైర్ రిచర్డ్ కెటిల్ బర్గ్ కూడా చెప్పుకొచ్చాడు.