Modi Cabinet: మోడీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది.


Published Jun 19, 2024 08:52:06 PM
postImages/2024-06-19/1718810526_mmmmodi.jpeg

న్యూస్ లైన్ డెస్క్:  ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేసింది. వరికి రూ. 177 ధర పెంపుతో కనీస మద్దతు ధర రూ. 2,300 చేరింది. పత్తి, మొక్కజొన్న, రాగి, జొన్న పంటలకు మద్దతు ధర పెంపు చేసింది. మినుముల కనీస మద్దతు ధర రూ. 7, 400, కందిపప్పు కనీస మద్దతు ధర రూ. 7,500, మినుముల కనీస మద్దతు ధర రూ. 7,400, పెసర పంట కనీస మద్దతు ధర 8, 682, వేరుశనగ ఎంఎస్పీ క్వింటాల్ కు రూ. 6,783గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 2870 కోట్లతో వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ, సముద్రం నుంచి కరెంటు ఉత్పత్తి చేసేలా తమిళనాడు, గుజరాత్‌లో పవర్ ప్లాంట్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ దహనులో రూ.76, 200 కోట్లతో ఆల్ వెదర్ గ్రీన్‌ఫీల్డ్, డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్ అభివృధ్ది.ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆమోదించింది. 

newsline-whatsapp-channel
Tags : telangana

Related Articles