AI: AI వచ్చినా ..ఈ ఉద్యోగాలకు మాత్రం ఢోకా లేదు !

. కొన్ని ఉద్యోగాలు ఏఐ వల్ల పోవచ్చు. వాటి ప్లేస్ లో మరో రెండు కొత్త ఉద్యోగాలు పుట్టుకురావచ్చు. కాని ఎన్ని కొత్త టెక్నాలజీలు వచ్చినా ..ఢోకా లేని ఉద్యోగాలు ఓ పది ఉన్నాయి


Published Aug 13, 2024 07:26:00 PM
postImages/2024-08-13/1723557432_aihumanjobs01063816x9.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: AI వచ్చాక లైఫ్ స్టైలే మారిపోతుంది. జస్ట్ ఉద్యోగాలు ..చదువులు పరిక్షలు , కళాత్మకత , ఇలా ప్రతి అంశంలోను ఏఐ ఇన్ఫులెన్స్ ఉంటుంది. కొన్ని ఉద్యోగాలు ఏఐ వల్ల పోవచ్చు. వాటి ప్లేస్ లో మరో రెండు కొత్త ఉద్యోగాలు పుట్టుకురావచ్చు. కాని ఎన్ని కొత్త టెక్నాలజీలు వచ్చినా ..ఢోకా లేని ఉద్యోగాలు ఓ పది ఉన్నాయి . వాటిని మాత్రం ఏం చెయ్యలేం. అవేంటో చూద్దాం.


సైంటిస్టులు : ఏఐ వల్ల శాస్త్రవేత్తల పని తగ్గొచ్చు కాని శాస్త్రవేత్లే లేకుండా అయిపోదు. కొత్త కొత్త అంశాలపై శాస్త్రవేత్తలు కొత్త కొత్త ప్రయోగాలకు మానవ మేథస్సు కు ఏఐ సాయం ఉంటుంది కాని పూర్తి మానవ మేథస్సును తుడిచిపెట్టలేదు.


లాయర్లు: న్యాయవాదులను కూడా ఏఐ ఏం చెయ్యలేదు. ఏఐ ప్రభావం సమస్యలకు , సవాళ్లకు న్యాయపరంగా ఎలా ముందుకు వెళితే పరిష్కారం దొరుకుతుందో లాయర్లకు తెలుస్తుంది. ఏఐ కు న్యాయపరమైన నాలెడ్జ్ ఉన్నా ..అదంతా మెకానికల్ గా మాత్రమే జరుగుతాయి. కాని ఏఐ ఉంటే హెల్ప్ మాత్రమే అవుతుంది కాని లాయర్లను రీప్లేస్ చెయ్యలేవు.


అనలిస్టులు, స్ట్రాటజిస్టులు: ప్రస్తుతం స్ట్రాటజిస్టులు , అనలిస్టులకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. వీరి తెలివికి ఏఐ సాయం అవుతుంది కాని ...మానవ మేథస్సుతో  ముందుగా జరిగేది అంచనా వేయగలరు..కాని ఏఐ ఇలా చెయ్యలేదు. ఏది ఏమైనా మిషన్ మిషన్ ...మనిషి మనిషే.


జర్నలిస్టులు: ఏఐ తో జర్నలిజాన్ని తుడిచిపెట్టదు..ప్రభుత్వ పాలనను , సమాజంలో లోపాలను మానవులు మాత్రమే జర్నలిస్టులు మాత్రమే వేలెత్తి చూపించగలం. ఏఐ ఈ పని చెయ్యలేదు. చీకటి కోణాలను బయటపెట్టి బాధితుల పక్షాన నిలబడగలిగే అవకాశం గ్రౌండ్ రియాల్టీలో మీడియాకే ఉంది తప్ప ఏఐ కి కాదు.


టీచర్లు : గురువు లేని  సమాజాన్ని ఊహించలేం కూడా..టీచింగ్ ప్రొఫిషన్ లో కొత్త కోణం వస్తుంది . ఏఐ సాయంతో విద్యార్ధులు కొత్త కాన్సప్ట్ లు నేర్చుకోవచ్చు కాని ఏఐ పూర్తి గా టీచర్ ను లేకుండా చెయ్యలేదు. ఏఐ కూడా ఓ గురువు ద్వారా నేర్చుకోవాలి.


సర్జన్లు , హెల్త్ కేర్ : వైద్యరంగం పై ఏఐ ప్రభావం దాదాపుగా ఉండదు. ఎందుకంటే ఒక మనిషి చికిత్సకు ఏఐ సాయం చేస్తుంది. కాని ఏఐ పూర్తిగా సర్జరీ చేయలేవు. డాక్టర్లు లేకుండా ఏఐ ఏం చెయ్యలేదు. టెక్నాలజీతో పూర్తిగా గైడెన్స్ లేకుండా ఏం చెయ్యలేం. సో ఇలాంటి ప్రొఫిషనల్స్ ను ఏఐ ఏం చెయ్యలేదు. ఇంకా ఏఐ సాయంతో ఈ ప్రొఫిషినల్స్ మంచి డవలప్ మెంట్ కూడా ఉంటుంది. ఆ రంగాలల్లో మరింత అభివృధ్దిని చూడొచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu doctors artificial-intelligence jobs

Related Articles