మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు అర్పించిన అమరుడిని సెకండ్ పారా రెజిమెంట్ చెందిన నాయిబ్ సుబేదార్ రాకేశ్ కుమార్ గా గుర్తించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జమ్ముకాశ్మీర్ లోని కిష్ట్వార్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో జూనియర్ కమిషన్ ఆఫీసర్ ( జేసీఓ) మృతి చెందారు. మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు అర్పించిన అమరుడిని సెకండ్ పారా రెజిమెంట్ చెందిన నాయిబ్ సుబేదార్ రాకేశ్ కుమార్ గా గుర్తించారు.
రీసెంట్ గా ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులను వీడీజీ చంపిన ఉగ్రవాదుల కోసం చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఉదయం కేశ్వాన్ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు , ఆర్మీ కి ఎదురుపడ్డారు. తర్వాత వీరిద్దరి మధ్య సైనికులు , టెర్రరిస్టుల మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఈ కాల్పుల్లో విడీజీల మృతదేహాలు లభ్యమైన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ కాల్పులు జరిగాయి.
కాల్పులు జేసీఓ సహా మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారని వారిని వెంటనే ఆస్పత్రి తరలించినట్లు వెల్లడించింది. అనంతరం అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా మారిందని తెలిపింది. వారిలో జేఓసీ, పరిస్థితి మిషమించి ప్రాణాలు కోల్పోయారని చెప్పింది."వైట్ నైట్ కార్ప్స్ జనరల్ కమాండింగ్ ఆఫీసర్- జీఓసీ సహా అన్ని ర్యాంకుల అధికారులు సెకండ్ పారా(స్పెషల్ ఫోర్సెస్) నాయిబ్ సుబేదార్ రాకేశ్ కుమార్ చేసిన అత్యున్నత త్యాగానికి సెల్యూట్ చేస్తున్నారు.