PRYAG RAJ: టాయిలెట్లకు QR కోడ్ ...స్కాన్ చేస్తే ఆటోమెటిక్ క్లీనింగ్ !

పర్యాటకుల కోసం 1.5 లక్షల మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీరిని శుభ్రం చేసేందుకు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.


Published Nov 08, 2024 04:49:00 PM
postImages/2024-11-08/1731064805_360F5443770385IxLipFXLy1dZHxte217uoYFFCzXLTMo.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా 2025 లో భక్తులు , పర్యాటకుల కోసం 1.5 లక్షల మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని శుభ్రంగా వుంచేలా  యోగీ సర్కార్ కొత్త ప్లాన్ చేసింది.ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025 లో భక్తులు, పర్యాటకుల కోసం 1.5 లక్షల మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీరిని శుభ్రం చేసేందుకు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.


QR కోడ్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా టాయిలెట్స్ స్వచ్ఛతను పరిశీలిస్తారు. ప్రత్యేక యాప్ ద్వారా ఏ టాయిలెట్లో మురికి ఉందో తెలుసుకుని కొద్ది నిమిషాల్లో శుభ్రం చేస్తారు. ఈ టాయిలెట్స్ క్లీన్ చెయ్యడానికి జెట్ స్ప్రే క్లీనింగ్ వాడుతున్నారు. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళాకు ఈసారి 40 కోట్లకు పైగా భక్తులు, పర్యాటకులు వస్తారని అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేళా ప్రాంతం మొత్తం 1.5 లక్షల టాయిలెట్స్, యూరినల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంతమంది వాడే టాయిలెట్స్ విషయంలో జాగ్రత్తగా ఉంచాలి ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.


QR కోడ్ స్కాన్ చేసి, యాప్ లో ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. టాయిలెట్ శుభ్రంగా ఉందా, తలుపు పగిలిపోయిందా, నీళ్ళు ఉన్నాయా వంటి ప్రశ్నలు ఉంటాయి. సమాధానాలు సబ్మిట్ చేయగానే కంట్రోల్ రూమ్ కు ఫీడ్ బ్యాక్ వెళ్తుంది. ఇందులో వీరు కంప్లెయింట్ కూడా రెయిజ్ చెయ్యొచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu uttarpradesh prayagraj mahakumbamela

Related Articles