viral: మామను కాల్చి చంపిన రేవంత్ ...ఏమైంది ..ఎందుకు ?

ఆమె తండ్రిపై పిస్టల్‌తో కాల్పులు జరిపిన ఘటన ఆదివారం సరూర్‌నగర్‌ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.


Published Nov 11, 2024 01:48:42 AM
postImages/2024-11-11/1731308323_HeroImage20241111T093601.679.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రేమ ఎంత మధురం ...ప్రియురాలి తండ్రి అంత కఠినం అందుకే అడ్డుతొలగించాలనుకున్నాడు ఓ ప్రభుద్దుడు. తను ప్రేమించిన అమ్మాయిని తనకు దూరం చేశారని కక్షగట్టిన ఒక యువకుడు ఆమె తండ్రిపై పిస్టల్‌తో కాల్పులు జరిపిన ఘటన ఆదివారం సరూర్‌నగర్‌ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. సరూర్ నగర్ లో వెంకటేశ్వర కాలనీలో ఓ వ్యాపారి కి ఇద్దరు కూతుర్లు. వ్యాపారి చిన్న కూతురు స్కూల్ చదువుతున్నప్పటి నుంచి తన స్కూల్ మేట్  బల్వీర్ సింగ్  తనను ప్రేమిస్తున్నానని వేధించేవాడు.


ఇద్దరూ ఒకే కళాశాలలో ఇంజినీరింగ్‌ కోర్సు చదివారు. అప్పుడు కూడా వేధింపులు ఆగలేదు. ఈ విషయం ఆమె తండ్రికి తెలియడంతో ఆరు నెలల కిందట బల్వీర్‌ సింగ్​ను హెచ్చరించాడు.  అప్పటి నుంచి బల్వీర్ సింగ్ తన తండ్రి పై కక్ష పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి తండ్రి ని ఎప్పకప్పుడు చంపేస్తానని తన ఫ్రెండ్స్ తో చెప్తుండేవాడు. అయితే  కొన్ని రోజుల క్రితం వారి ఇంటి దగ్గరకి వెళ్లి గొడవపెట్టుకున్నాడు కూడా. ఇదంతా చూసిన తండ్రికి కూతురు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని తనను విదేశాలకు పంపించాడు. ప్రేమించిన అమ్మాయిని దక్కకుండా చేశాడని పగ పెంచుకున్నాడు. బల్వీర్ ఆదివారం ఆ యువతి ఇంటికెళ్లాడు.


యువతి తండ్రిపై ఎయిర్‌ పిస్టల్‌తో ఒక రౌండు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన కుడి కన్నుపై గాయమైంది.  తర్వాత వారి కారు అద్దాలను ధ్వంసం చేసి బైక్ పై పరారయ్యాడు. పోలీసులు వెంటనే బల్వీర్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వ్యక్తి క్షేమంగానే ఉన్నారని, చికిత్స పొందుతున్నారని వివరించారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu attack america love girls air-fireing

Related Articles