వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో ఇప్పటి వరకు 163మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా మెప్పాడి, ముండక్కే, అట్టామలై, చూరల్మలై తదితర ప్రాంతాల్లో భారీ కొండ చరియలు విరిగిపడి భయోత్పాతం సృష్టించాయి.
న్యూస్ లైన్ డెస్క్ : కేరళలలోని వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో ఇప్పటి వరకు 163మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా మెప్పాడి, ముండక్కే, అట్టామలై, చూరల్మలై తదితర ప్రాంతాల్లో భారీ కొండ చరియలు విరిగిపడి భయోత్పాతం సృష్టించాయి. అనేక ఇళ్లు, దుకాణాలు, నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మట్టిలో కూరుకుపోయాయి.
భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ డిపార్ట్ మెంట్, ఆర్మీ, స్థానిక యువత సహాయక చర్యలల్లో పాల్గొంటున్నారు. విరిగిపడ్డ కొండ చరియలను తవ్వుతున్నా కొద్ది మృతదేహాలు బయట పడుతున్నాయి. ప్రమాద తీవ్రతను కింది ఫొటోల్లో చూడవచ్చు.
ముంచెత్తుతున్న వరద
జలమయమైన పాఠశాల.. నివాస ప్రాంతాలు
వరద ధాటికి ధ్వంసమైన ఓ ఇల్లు
వరద ధాటికి కొట్టుకొచ్చిన ఓ వాహనం
విరిగిపడిన కొండ చరియలను తొలగిస్తున్న దృశ్యం
చిక్కుకుపోయిన వారిని బయటకు తీస్తున్న సహాయక బృందాలు
వరద ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలింపు
తాడు సహాయంతో వరద నీటిని దాటుతున్న సహాయక సిబ్బంది
బాధితులను బోటులో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యం