3 Re-relaes: మళ్లీ కొలవెరి డీ.. ఎప్పుడో తెలుసా..?

3 అనేది సినిమా మాత్రమే కాదు. అదొక ఎమోషన్ అని చెప్పుకునే వీరాభిమానులు కూడా ఉన్నారు. ఈ సినిమాలోని కథకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. పాటలకు అంతకు మించిన ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. 


Published Aug 14, 2024 06:33:00 PM
postImages/2024-08-14/1723640580_3.jpg

న్యూస్ లైన్ డెస్క్: హీరో ధనుష్, నటి శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం '3'. ఈ సినిమా 2012లో మార్చి 3న మొట్టమొదటి సారిగా విడుదల అయింది. ఈ సినిమా ధనుష్ మాజీ భార్య, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో వచ్చింది. ఆమె డైరెక్ట్ చేసిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. అయితే, ఈ సినిమా తమిళంలో మొదట విడుదలైనప్పటికీ.. అక్కడి ప్రేక్షకులను పెద్దగా అలరించలేక పోయింది. 

కానీ, 3 మూవీ తెలుగు వెర్షన్ కు మాత్రం ప్రేక్షకుల నుంచి చెప్పలేనంత ఆదరణ లభించిందని చెప్పొచ్చు. సినిమా తొలిసారి రిలీజ్ అయినప్పుడే కాకుండా.. రీరిలీజ్‌కు కూడా అత్యధిక థియేటర్లలో హౌస్ ఫుల్ ఐన సినిమాగా 3 రికార్డ్ క్రియేట్ చేసింది. యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకు ఇపప్టికీ ఫ్యాన్స్ ఉన్నారు అంటే.. 3 మూవీకి ఎంత క్రేజ్ ఉందో అర్ధమవుతుంది. 3 అనేది సినిమా మాత్రమే కాదు. అదొక ఎమోషన్ అని చెప్పుకునే వీరాభిమానులు కూడా ఉన్నారు. ఈ సినిమాలోని కథకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. పాటలకు అంతకు మించిన ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. 

అయితే, 3 సినిమా మరోసారి రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సారి మాత్రం ఒకటి రెండు ప్రాంతాల్లోనే కాదు. ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రీరిలీజ్‌ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. వచ్చే నెల 14న దేశవ్యాప్తంగా ఉన్న పలు థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో 3 మూవీ ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.   
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu release cinema-news dhanush 3-movie why-this-kolaveri

Related Articles