నాన్న కు భయపడి స్కూల్ లో దాక్కుంది ఓ బంగారు తల్లి. ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో జరిగింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కూతురుకి నాన్నఓ ప్రత్యేకమైన బాండ్ ఉంటుంది. ప్రపంచం అంతా ఒక వైపు నాన్న మాత్రం కూతురు వైపు ...ఆ బంధమే వేరు. కాని కూతురు , పిల్లలు బంధాలు చూడని నీచపు మనుషులు కూడా ఉంటారు. అయితే నాన్న కు భయపడి స్కూల్ లో దాక్కుంది ఓ బంగారు తల్లి. ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో జరిగింది.
'మా నాన్న రోజూ నన్ను కొడుతున్నాడు. ఎవరికైనా అమ్మేస్తా అంటున్నాడు. నాన్నను చూస్తేనే నాకు భయమేస్తోంది. నేను మా ఇంటికి వెళ్లను' అని 6th క్లాస్ చదివే ఓ విద్యార్థిని బిక్కుబిక్కుమంటూ పాఠశాలలో దాక్కుంది. కాని తండ్రి వెర్షన్ వేరేలా ఉంది. తన కూతుర్ని తనకు అప్పగించాలని స్కూల్ కే వచ్చి గొడవపడడంతో అక్కడ టీచర్లు, స్టూడెంట్స్ అందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు తెలిపి కంప్లెయింట్ ఫైల్ చేశారు.
హైదరాబాద్ బాబానగర్‌కు చెందిన అక్బర్, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కొన్ని నెలల క్రితం చౌటుప్పల్‌కు వచ్చి, అక్కడే నివాసం ఉంటున్నారు. ఆరో తరగతి చదువుతున్న వారి కుమార్తెను ఈ ఏడాదే చౌటుప్పల్‌లోని బంగారుగడ్డలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చేర్పించారు. అక్కడ తన భార్యతో గొడవపడి తన కొడుకొని తీసుకొని వెళ్లిపోయింది. కాని కూతురుతో ఉంటున్న అక్బర్ మాత్రం తన భార్యపై తనకున్న కోపాన్ని కూతురుపై చూపిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. తను జరిగిన విషయాన్ని స్కూల్ టీచర్ కు చెప్పగా వెంటనే బాలికను మండల వనరుల కేంద్రానికి తరలించారు.