Alluarjun:అల్లు అర్జున్ తో సినిమా అంటే హీరోయిన్స్ వణుకుతున్నారట.!

టాలీవుడ్ లో  ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. వారందరిలోకెల్లా  అద్భుతమైన ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న హీరో అల్లు అర్జున్.  ఆయనకు ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ, ఏ మాత్రం అది


Published Aug 04, 2024 03:25:35 PM
postImages/2024-08-04/1722765335_heroins.jpg

న్యూస్ లైన్ డెస్క్: టాలీవుడ్ లో  ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. వారందరిలోకెల్లా  అద్భుతమైన ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న హీరో అల్లు అర్జున్.  ఆయనకు ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ, ఏ మాత్రం అది పట్టించుకోకుండా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాంటి అల్లు అర్జున్ గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ చిత్రం ద్వారా అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఆయన తన ఫేస్ పూర్తిగా మార్చుకుని  ఆర్య సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చారు.

అలాంటి అల్లు అర్జున్ ఇండస్ట్రీలో ఎంతో దూసుకుపోతున్న కానీ, ఆయనతో నటించిన ఏ హీరోయిన్ అయినా సరే దారుణంగా విఫలమవుతుందట.. ఇండస్ట్రీలలో టాలెంటులతో పాటు కాస్త సెంటిమెంట్ కూడా ఉంటుంది. కొందరు హీరోయిన్లు కేవలం నాలుగైదు సినిమాలకే పరిమితమై ఆ తర్వాత ఇండస్ట్రీలో రాణించలేకపోతున్నారు. ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ సరసన చేసిన ఏ హీరోయిన్ అయినా ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

అల్లు అర్జున్ హీరోగా వరుడు చిత్రం అందరికీ తెలుసు. ఇందులో హీరోయిన్ గా భాను శ్రీ మెహ్రా నటించింది. ఈ సినిమా కూడా పరాభవం పొందినా కానీ ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీలో కనిపించలేదు. పరుగు చిత్రంలో హీరోయిన్ గా చేసిన షీలాకౌర్  ఆ తర్వాత ఎన్టీఆర్ తో అదుర్స్ సినిమా చేసి ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బన్నీ మూవీలో గౌరీ ముంజలు చేసింది. దానికి మూవీ తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరమైంది.

 అల్లు అర్జున్ మొదటి మూవీ గంగోత్రి లో అతిథి అగర్వాల్ చేసింది. కానీ ఈమె కూడా ఇండస్ట్రీకి దూరమైంది. వేదం చిత్రంలో చేసిన దీక్ష  సెత్ ఇండస్ట్రీకి దూరమైంది.  ఇలా అల్లు అర్జున్ తో ఎవరు నటిస్తే వారంతా ఇండస్ట్రీకి అనూహ్యంగా దూరమవుతుండడం వైరల్ గా మారాయి. దీంతో హీరోయిన్ అల్లు అర్జున్ తో సినిమా అంటే భయపడిపోతున్నారట.

newsline-whatsapp-channel
Tags : news-line allu-arjun gowri-munjal athithi-agarwal,

Related Articles